మొద‌టి వారం కాంచ‌న రెండో వారం ఎవెంజ‌ర్స్

Update: 2019-04-23 07:38 GMT
విమ‌ర్శ‌కులు ప్ర‌శంసించారు - మా నాని యాక్ష‌న్ కుమ్మేశాడని స్టార్ హీరోలు ట్వీట్లు చేశారు - ఇంకాస్తా ముందుకెళ్లి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మ‌రీ జెర్సీ టీమ్ ని పొగ‌డ్త‌ల వ‌ర్షంతో త‌డిపేశాడు. అయితే ఇవ్వ‌న్ని జెర్సీ సినిమాను మాస్ ఆడియెన్స్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాలేకపోతున్నాయ‌ని ట్రేడ్ లెక్కులు చెబుతున్నాయి. జెర్సీతో విడుద‌లైన కాంచ‌న 3 మాస్ ఆడియెన్స్ కి క‌నెక్ట్ అయింద‌న‌డంలో సందేహ‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. ఎందుకంటే జెర్సీ మొద‌టి మూడు రోజులు క‌లెక్ష‌న్స్ కి స‌రిస‌మానంగా కాంచ‌న 3 క‌లెక్ష‌న్స్ ఉంట‌డం గ‌మ‌నార్హం. దీంతో అటు నిర్మాత‌లు - ఇటు బ‌య్య‌ర్లు తెగ ఆందోళ‌న‌ప‌డుతున్నార‌ని తెలిసింది. అంతేకాదు చాలా ఏ సెంట‌ర్స్ లో జెర్సీని రెండేసి ధియేట‌ర్స్ లో విడుద‌ల చేయ‌డం కూడా క‌లెక్ష‌న్స్ పై భారీ ప్ర‌భావం చూపుతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే నిన్న‌టి నుంచి కాంచ‌న క‌లెక్ష‌న్స్ త‌గ్గు ముఖం ప‌ట్టాయి.

అంతో ఇంతో జెర్సీకి ఇదికి క‌లివ‌చ్చే అంశ‌మే కానీ ఈ నాలుగు రోజుల్లో వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ధియేట‌ర్లు ఖ‌ర్చుల‌కే స‌రిపోయే అవ‌కాశం ఉంది. ఎటొచ్చి వ‌చ్చే వారంతంలోనే జెర్సీకి క‌లెక్ష‌న్స్ పెరిగే అవ‌కాశం ఉంది. కానీ గోల్డెన్ టైమ్ ని కూడా జెర్సీ టీమ్ చేజార్చుకునే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి. 4ఎవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ రూపంలో జెర్సీకి వ‌చ్చే సెకండ్ వీకెండ్ క‌లెక్ష‌న్స్ భారీగా త‌గ్గ‌నున్నాయి. ఇప్ప‌టికే అన్ని టికెటింగ్ వెబ్ సైట్స్ లో - మ‌ల్టీపెక్సుల్లో ఈ హాలీవుడ్ సినిమాకు అడ్వాన్ బుక్లింగ్స్ అయిపోయాయి. అంటే మ‌ల్టిప్లేక్స్ ఆడియెన్స్ అంతా ఈ వారంతంలో జెర్సీ కంటే ఎవెంజర్స్ పైనే దృష్టి పెట్టార‌న్న‌ది ఇప్ప‌టికే తెలిసిపోయింది. ఇక ఏ - బి - సి సెంట‌ర్స్ లో ఎవెంజ‌ర్స్ తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ జెర్స్ క‌లెక్ష‌న్స్ ని కొల్ల‌గొట్టే అవ‌కాశం ఉందని బ‌య్య‌ర్లు చెబుతున్నారు. దీంతో ఈ ప‌రిస్థితిని ఎలా దాటాలో తెలియని అయోమ‌య ప‌రిస్థితుల్లో ప్ర‌స్తుతం జెర్సీ బృందం ఉంద‌ని - హిట్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ - క‌లెక్ష‌న్స్ అనుకున్నంత రేంజు లో రాక‌పోవ‌డంతో కాస్త దిగులుగానే ఈ సినిమా టీమ్ ఉంద‌ని తెలిసింది.
Tags:    

Similar News