'క్షణం' 'ఎవరు' 'గూఢచారి' వంటి విభిన్న చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు ''మేజర్'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అడివి శేష్ టైటిల్ రోల్ లో 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. విడుదలకు ముందే ప్రివ్యూలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ బయోపిక్.. గత శుక్రవారం (జూన్ 3) థియేటర్లలోకి వచ్చింది.
ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన తెచ్చుకున్న 'మేజర్' సినిమా.. భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఫలితంగా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 35.60 కోట్లు కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఫస్ట్ డే రూ.13.40 కోట్లు అందుకున్న ఈ సినిమా.. రెండు మూడు రోజులలో కూడా సమానంగా వసూలు చేసింది. ఈ క్రమంలో 35.60 కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. యూఎస్ఏలో $860K వసూళ్ళు రాబట్టి మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.
ఇకపోతే 'మేజర్' మూవీ ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈరోజుతో మరికొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇది హీరో అడివి శేష్ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ పాన్ ఇండియా మూవీ ఎలాంటి వసూళ్ళు సాధిస్తుందో చూడాలి.
''మేజర్'' చిత్రానికి శశి కిరణ్ దర్శకత్వం వహించారు. అడివి శేష్ కథ స్క్రీన్ ప్లే అందించగా.. అబ్బూరి రవి మాటలు రాశారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - ఎ ప్లస్ ఎస్ మూవీస్ - సోనీ పిక్చర్స్ ఇండియా సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
ఇందులో శేష్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోభిత ధూళిపాళ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.