కరోనా సమయంలో ఇండియాలో ఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగింది. కరోనా ముందు ఓటీటీ మార్కెట్.. కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ అన్నట్లుగా ఇండియాలో పరిస్థితి మారింది. కరోనా సమయంలో ప్రేక్షకులు పూర్తిగా ఓటీటీ పైనే ఎంటర్ టైన్మెంట్ పై ఆధారపడ్డారు. ఇప్పుడు థియేటర్ లు పూర్తి స్థాయిలో రన్ అవుతున్నాయి. అయినా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ ఏమాత్రం తగ్గలేదు.
ప్రతి వారం భారీ చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకు ఎన్నో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా భారీ ఎత్తున సినిమా లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు.. ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న మేజర్ సినిమా ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీ లో మేజర్ ను ఇప్పుడు స్ట్రీమింగ్ చేయవచ్చు.
శుక్రవారం ఓటీటీ లో మేజర్ స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉన్నా కాస్త ఆలస్యంగా మేజర్ ను ఒక రోజు ఆలస్యంగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో మేజర్ స్ట్రీమింగ్ అవుతుంది. అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్ సినిమా కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. భారీగా వసూళ్లు కూడా నమోదు అయ్యాయి. విక్రమ్ వంటి కమర్షియల్ సినిమా తో పోటీ పడి మరీ మేజర్ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.
ఈ వారం ఓటీటీ ప్రపంచంలో కేవలం మేజర్ మాత్రమే కాకుండా మరికొన్ని వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే... బాల భారతము అనే యానిమేషన్ వెబ్ సిరీస్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. అన్యస్ టుటోరియల్ ను తెలుగు మరియు తమిళంలో ఆహా వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 వాల్యూమ్ 2 ను నెట్ ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ తో పాటు అన్ని ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ది టర్మినల్ లిస్ట్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా.. విరాటపర్వం సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో మేజర్ మరియు విరాటపర్వం లు స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో సౌత్ లో నెట్ ఫ్లిక్స్ యూజర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. ఇక అమెజాన్ లో బాలీవుడ్ భారీ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ స్ట్రీమింగ్ అవుతోంది. జీ 5 లో కంగనా రనౌత్ నటించిన ధకాడ్ సినిమా స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. మొత్తానికి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్.