`మేజర్` థియేట్రికల్ విడుదల వాయిదా

Update: 2021-05-26 04:47 GMT
అడివి శేష్ న‌టిస్తున్న `మేజర్` హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుదలవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవ‌న‌ ప్రయాణాన్ని మేజ‌ర్ లో ఆవిష్క‌రిస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభ‌రితంగా తెర‌పై చూపించ‌నున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు.

స‌‌యీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ‌- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్ర‌ధాన తారాగ‌ణం. శ‌శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది. శేష్ ఈ చిత్రానికి క‌థ‌-క‌థ‌నం అందించారు.

కెరీర్ లో ఉత్తమ దశను ఆస్వాధిస్తున్న అడివి శేష్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో ప్రవేశించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. మేజర్ ను జూలై 2 న హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ మొదట్లో ప్లాన్ చేశారు. అయితే సెకండ్ వేవ్ కారణంగా వారు ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

``మ‌న‌మంతా క‌ష్ట‌ కాలంలో జీవిస్తున్నాం. మీరు అన్ని భద్రతా ప్రోటోకాల్ లను అనుసరిస్తున్నారని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాం. వాస్తవానికి జూలై 2న ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేయబడిన మేజర్ వాయిదా పడుతున్నట్లు ప్రకటించాలనుకుంటున్నాం. ప‌రిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కొత్త థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటిస్తాం`` అని టీమ్ ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News