అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం `మేజర్`. బహు భాషల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణాన్ని మేజర్ లో ఆవిష్కరిస్తున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. సయీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ప్రధాన తారాగణం. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది. శేష్ ఈ చిత్రానికి కథ-కథనం అందించారు.
మేజర్ దేశంలోని ప్రజలందరి హృదయాల్ని టచ్ చేసే చిత్రం అవుతుందని శేష్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకోసం ఎంతగానో శ్రద్ధ తీసుకుని ప్రతిదీ నిశితంగా పరిశోధించి తెరకెక్కంచామని వెల్లడించారు. ``మేజర్ బహుభాషలలో ఒకేసారి చిత్రీకరించాం. వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలు వారి సందర్భాల నుండి చిత్రీకరించిన అనేక సన్నివేశాలు ఉన్నాయి. సూక్ష్మంగా పరిశోధించి ప్రతిదీ అందరినీ ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాం. దానికి తగ్గట్టే సినిమాని మలిచాం`` అని శేష్ వెల్లడించారు.
సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన ఈ చిత్రం తదుపరి రిలీజ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. శేష్ ఈ సినిమాతో పాటు గూఢచారి సీక్వెల్లో నూ నటించాల్సి ఉండగా దానికి స్క్రిప్ట్ రెడీ అవుతోంది.