అయ్యో! యాంకర్ స్రవంతికి ఏమైంది.. హాస్పిటల్ బెడ్డుపై ఇలా..
హాస్పిటల్ బెడ్ పై స్రవంతి కనిపించిన విధానం ఆమె సన్నిహితులను షాక్ కు గురి చేశాయి.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ లుక్స్ తో దర్శనమిచ్చే యాంకర్స్ లలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమధ్య పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లలో కూడా ఆమె హోస్ట్ గా తన టాలెంట్ ను చూపిస్తున్నారు. అయితే ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఆమె సోషల్ మీడియాలో ఊహించని పోటోలను పోస్ట్ చేసింది. హాస్పిటల్ బెడ్ పై స్రవంతి కనిపించిన విధానం ఆమె సన్నిహితులను షాక్ కు గురి చేశాయి.
ఇక హాస్పిటల్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్రవంతి వివరణ ఇస్తూ.. అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు .ఇప్పుడు పెట్టక తప్పడం లేదు, కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే. స్పెషల్ గా “ఆడవారికోసం” గత 35 - 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్. రకరకాల మెడిసిన్ వాడాను, డాక్టర్ ని డైరెక్ట్ వెళ్లి కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదు.
అయితే ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది, విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని, వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీ కి వెళ్లాల్సి వచ్చింది. ఈజీ గా కంప్లీట్ గా రికవర్ అవ్వాలి, ముందు లాగ నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడ్డది అని చెప్పారు డాక్టర్ తెలిపారు.
సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే. అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేసాను మల్లి హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో,ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి, అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే, హెల్త్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. వర్క్, షూట్స్, ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చెయ్యకండి.
ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. అని స్రవంతి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఇక ఈ సమయంలో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని అంటూ త్వరలోనే మరింత శక్తితో అందరిముందుకు వస్తాను అని వివరణ ఇచ్చింది. ఇక స్రవంతి త్వరగా కొలికోవాలి అని సన్నిహితులు ఫాలోవర్స్ కోరుకున్నారు.