'మేజర్' టీజర్: దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్ళని కాపాడటం సైనికుడి పని
26/11 ముంబై తీవ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ''మేజర్''. టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఇందులో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు (జీఎంబీ ఎంటర్టైన్మెంట్) మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - ఫస్ట్ గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'మేజర్' టీజర్ ని ముగ్గురు సూపర్ స్టార్స్ విడుదల చేశారు. తెలుగు - సూపర్ స్టార్ మహేష్ బాబు.. హిందీ - సల్మాన్ ఖాన్.. మలయాళం - పృథ్వీరాజ్ ఈ టీజర్ ను రిలీజ్ చిత్ర బృందానికి విషెస్ తెలియజేసారు.
మేజర్ సందీప్ పాత్రధారి అడవి శేష్ శరీరంలో బుల్లెట్స్ దిగి రక్తం కారుతుండగా.. 'సైనికుడిగా ఉండడం అంటే ఏమిటి?' అనే వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అయింది. 2006 నవంబర్ 26న ముంబై తాజ్ హోటల్ లో టెర్రరిస్టులు జరిపిన మారణహోమాన్ని ఇందులో చూపించారు. మేజర్ సందీప్ ఎలా ఈ లోకాన్ని విడిచారు అనేది మాత్రమే కాకుండా.. ఎలా జీవించాడు అనేది ఇందులో చూపిస్తున్నారు. దేశాన్ని రక్షించే సైనికుడిగా మారడానికి అతన్ని ఎలాంటి ఏమేమి ప్రోత్సహించాయి.. వాళ్ళ తల్లిదండ్రులు మరియు ప్రేమించిన అమ్మాయి పాత్ర ఎంటనేది చెప్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్ - రేవతి నటించగా.. అతని ప్రేయసిగా బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కనిపించింది. హోటల్ లో చిక్కుకున్న ఎన్నారై యువతిగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల నటించింది.
'మేజర్' టీజర్ ఆధ్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్ గా సాగింది. ''బోర్డర్ లో ఆర్మీ ఎలా ఫైట్ చేయాలి.. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి అని అందరూ ఆలోచిస్తారు.. అదీ దేశ భక్తే.. దేశాన్ని ప్రేమించడం అందరి పనే.. వాళ్ళని కాపాడటం సోల్జర్ పని'' అని శేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అడవి శేష్ మేజర్ సందీప్ పాత్రలో ఒదిగిపోయాడని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. 'మీరు పైకి రాకండి.. నేను వాళ్లని హ్యాండిల్ చేస్తాను' అని చెప్పే డైలాగ్ తో టీజర్ ముగిసింది. దీనికి శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. వినయ్ కుమార్ - పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రానికి శేష్ స్టోరీ - స్క్రీన్ ప్లే అందించగా.. అబ్బూరి రవి సంభాషణలు రాశారు. అన్ సంగ్ హీరో సందీప్ లెగసీని గౌరవించే ఈ ప్రయత్నంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగం కావడంతో 'మేజర్' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జులై 2న తెలుగు హిందీ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Full View