ప్రతి ఒక్కరి దేశ భక్తి తట్టిలేపే 'మేజర్‌'

Update: 2021-06-05 07:30 GMT
రియల్‌ హీరో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'మేజర్‌' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ బాబు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీగా సోనీ పిక్చర్స్ వారి భాగస్వామ్యంలో రూపొందిన మేజర్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. 26/11 ఉగ్ర దాడుల సమయంలో ఉన్ని కృష్ణన్‌ సాహసోపేత నిర్ణయాలను ఆ సమయంలో ఆయన భావోద్వేగాలను చక్కగా చూపిస్తూ ఈ సినిమా సాగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. అడవి శేషు ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ ను పోషిస్తుండగా కీలక పాత్రలో సయీ మంజ్రేకర్‌.. శోభిత.. ప్రకాష్‌ రాజ్‌.. రేవతి వంటి స్టార్స్‌ కనిపించబోతున్నారు. మేజర్‌ జీవితంలోని వివిధ దశలను చూపించడంతో పాటు ఉగ్ర దాడి సమయంలో జరిగిన సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నారు. తాజాగా అడవి శేషు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

మేజర్‌ చిత్రం ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని తట్టి లేపుతుంది. వివిధ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుందని అన్నాడు. ప్రతి ఒక్కరి హృదయాలను టచ్‌ చేసే విధంగా మేజర్‌ ఉన్ని కృష్ణన్‌ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ లేకుండా ఉంటే జులై 2 న సినిమాను విడుదల చేయాల్సి ఉంది. కాని వాయిదా వేసే అవకాశం ఉంది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడు విడుదల అయినా కూడా సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News