బాలీవుడ్ కపుల్స్ రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా నటిస్తోన్న `బ్రహ్మస్ర్త` పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ సమర్పకుడిగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమాకి సౌత్ వైడ్ ప్రత్యేకంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ సహకారంతో సోషియో పాంటసీ చిత్రం తెలుగు అభిమానాలకు మరింత దగ్గరైవుతోంది. ట్రైలర్ ని మెచ్చుతూ మెగాస్టార్ ఇచ్చిన వీడియో అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక సినిమా భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిలో భాగంగా ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా కొద్ది సేపటి క్రితమే `కుంకుమల` అంటూ సాగే వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు. సిద్ద్ శ్రీరామ్ ఈ మోలోడీ పాటని ఆలపించగా ..చంద్రబోస్ రసచన చేసారు. పాట ఆద్యంతం మోలోడీ వేవ్ లో వెళ్తుంది. అలియా..రణబీర్ మాధ్యనే పాట సాగుతుంది. కాశీ అందాల్లోనే చాలా భాగం పాట చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
పాట బ్యాక్ గ్రౌండ్ అంతా దాదాపు కాశీనే కనిపిస్తుంది. గంగానదీ పరివాహక ప్రాంతాల్ని పాటలో హైలైట్ చేస్తూ చూపించారు. సంగీత ప్రియుల్ని పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మెలోడీ ప్రియలకు బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా రిలీజ్ కి ముందే మొత్తం వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఆ పాట వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో అమితాబాచ్చన్..కింగ్ నారార్జున..షారుక్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే. మౌనీ రాయ్ సెకెండ్ లీడ్ లో కనిపించనుంది. సెప్టెంబర్ 9న సినిమా రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు..తమిళ్..మలయాళం..కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వి. మణికందన్.. పంకజ్ కుమార్ .. సందీప్ ఛటర్జీ వికాస్ నౌలకా సినిమాటోగ్రఫీ అందించారు. స్టార్ స్టూడియోస్- ధర్మ ప్రొడక్షన్స్- ప్రైమ్ ఫోకస్- స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Full View