పాన్ ఇండియా మూవీకోసం 'నేచురల్ ఫారెస్ట్' సెట్..!

Update: 2021-03-31 09:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కుతోంది 'ఆదిపురుష్'. ప్రపంచస్థాయి 3డి టెక్నాలజీతో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ ఇదే కావడం విశేషం. దాదాపు 400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ భాషలతో పాటు ప్రపంచదేశాల్లో ఇతర భాషలలో విడుదల కాబోతుంది. తానాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఐతే ఈ నెల ప్రారంభంలో మొదలైన ఆదిపురుష్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా ముంబైలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్, అలాగే ఇతర ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి మేకర్స్ భారీ అడవి సెట్ నిర్మించిన విషయం తెలిసిందే.

ఆ అడవి సహజంగా కనిపించేలా ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారట. దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. నిజమైన అడవుల్లో ప్రయాణంగాని షూట్ చేయడంగాని చాలా కష్టం అవుతుంది. ఇప్పటికే కేరళలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి నుండి పర్మిషన్ పొందటానికి పుష్ప టీమ్ చాలా కష్టపడ్డారు. మొత్తానికి ఆదిపురుష్ బృందం వాస్తవానికి దగ్గరగా కనిపించే అటవీ సెట్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక మోషన్ క్యాప్చర్ బృందం సెట్స్‌లో ఉండి సరైన ఫుటేజ్ షూట్ చేయనుందని టాక్. ఆదిపురుష్ సినిమాతో ఇండియాలో మరో కొత్త టెక్నాలజీని పరిచయం చేయబోతున్నారు. రియల్ టైమ్ టెక్నాలజీతో వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ జోడించనున్నారట. ఈ 3డి రామాయణంలో లార్డ్ రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో కృతిసనన్ కనిపించనుంది. అలాగే లక్ష్మణుడుగా సన్నీసింగ్, లంకాధిపతి రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. వచ్చేఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
Tags:    

Similar News