బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ మరో నటుడు ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన చిత్రం 'గులాబో సితాబో'. రోనీ లాహిరి - షీల్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ సర్కార్ దర్శకత్వం వహించారు. 'పీకూ' సినిమా తర్వాత అమితాబ్ - సుజీత్ సర్కార్ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని తొలుత 2020 ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత అంతకంటే ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసింది. కానీ దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన 'గులాబో సితాబో' విడుదల సాధ్యపడలేదు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో జూన్ 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్ రిలీజ్ వదులుకొని డైరెక్ట్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'గులాబో సితాబో' అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా 'గులాబో సితాబో' ట్రైలర్ నేడు విడుదలైంది.
అమితాబ్ బచ్చన్ - ఆయుష్మాన్ ఖురానా తమ పాత్రల్లో జీవించేశారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. సరిహద్దులను చెరిపేసే సరదా కథగా తెరకెక్కింది. ఇందులో అమితాబ్ ఒక ముస్లిం ఇంటి యజమానిగా.. ఆయుష్మాన్ ఖురానా అతని దగ్గర హిందూ కిరాయిదారుగా నటించారు. టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్స్ లో వీరిద్దరూ అదరగొట్టారనే చెప్పొచ్చు. అమితాబ్ మరోసారి తనదైన యాక్టింగ్ తో అలరించగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయుష్మాన్ ఖురానా కూడా తన మార్క్ నటన కనబరిచాడని చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయితే బాగుండు అనే భావన కలగక మానదు. కానీ ఈ ట్రైలర్ చూస్తే మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్ ఓల్డ్ సినిమా ఒకటి గుర్తుకు వస్తుంది. కాకపోతే ఈ సినిమా దానికి కంప్లీట్ డిఫరెంట్ అని తెలుస్తోంది. సున్నితమైన అంశాలను తీసుకొని హ్యూమర్ జెనరేట్ అయ్యేలా జూహీ చతుర్వేది చాలా బాగా రాశారని అర్థం అవుతోంది. శాంతను మొయిత్రా అందించిన నేపథ్య సంగీతం కూడా అలరిస్తుంది. వచ్చే నెల 12వ తారీఖున ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అమితాబ్ - ఆయుష్మాన్ నటించిన ఈ సినిమా ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి..!
Full View