సినీ ఇండస్ట్రీ గత ఐదు నెలలుగా గడ్డు కాలం ఎదుర్కుంటున్న నేపథ్యంలో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ లో మాత్రం కొందరు మేకర్స్ వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరంతా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఉన్నాయనే ధైర్యంతోనే సినిమాలు తీస్తున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు చిన్న నిర్మాతలు తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి.. వాటిని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. థియేటర్స్ దొరకకపోయినా ఓటీటీలు ఉన్నాయనే ధైర్యంతో నిర్మాతలు సినిమాలు చేసేస్తున్నారు.. దీంతో ఇండస్ట్రీకి చాలామంది నటీనటులు కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారు.
కాగా, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ని హీరోగా పెట్టి ఈ మధ్య వరుసగా సినిమాలు తీస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోతో క్రేజ్ దక్కించుకున్న సుధీర్ కామెడీని అభిమానించే వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ క్రేజ్ తో ఇప్పుడు సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నాడు సుధీర్. ఇప్పటికే 'సాఫ్ట్ వేర్ సుధీర్' '3 మంకీస్' వంటి సినిమాల్లో నటించిన సుడిగాలి సుధీర్.. మరికొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ కూడా దర్శకుడిగా మారుతున్నాడు. జేడీ చక్రవర్తిని హీరోగా పెట్టి ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఓటీటీలను నమ్ముకొని మేకర్స్ చిన్న సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారని తెలుస్తోంది. ఫ్యూచర్ లో ఈ సినిమాలకి థియేటర్స్ అందుబాటులో లేకపోయినా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో లేదా ఏటీటీలలో రిలీజ్ చేసుకోవచ్చని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.