‘‘అవును.. డైరెక్టర్ శంకరేంటి ఇలా చేస్తున్నాడు.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా 2.0 ఎప్పుడు మొదలెట్టాడని. అప్పుడెప్పుడో రిలీజవుతుందని కూడా చెప్పాడు కదా. వారాలు, నెలలు గడిచిపోతున్నాయో సినిమా ఎంతవరకు వచ్చిందో చెప్పడు. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో చెప్పాడు. రిలీజ్ డేట్ లాక్ చేయడు. ఏమన్నా అంటే గ్రాఫిక్స్ అవట్లేదనే మాట మాత్రం చెబుతున్నారు. ఎంత గ్రాఫిక్స్ అయినా మరీ ఇంత లేటా..’’ కోలీవుడ్ అండ్ టాలీవుడ్ లో చాలా రోజులుగా వినిపిస్తున్న మాటిది. శంకర్ మరీ ఎక్కువగా థింక్ చేస్తున్నాడని కామెంట్ చేసినవారూ లేకపోలేదు.
ఇప్పుడు వీటన్నింటికి ఓ ఆన్సరొచ్చింది. తాజాగా 2.0 విఎఫ్ ఎక్స్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్ శంకర్.. విలన్ గా చేస్తున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. టెక్నికల్ టీంలోని ముఖ్యమైన వాళ్లు.. గ్రాఫిక్స్ చేస్తున్న థర్డ్ ఫ్లోర్ కంపెనీలోని నిపుణులు ఈ సినిమాను ఎంత రిచ్ గా తెరకెక్కిస్తున్నారో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఏం రేంజిలో ఉంటాయో.. యాక్షన్ సీన్స్.. గ్రీన్ మాట్ లో తీసే సీన్స్ ఎలా ఉంటాయి? ఇందుకోసం ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు ఇలా అన్ని వివరాలు చెప్పుకొచ్చారు. దాంతోపాటు తెరపై కనిపించే యాక్షన్ సన్నివేశాలను కార్టూన్ లో డిజైన్ కూడా చేసి చూపించారు.
ఇదంతా చూశాక ఎవరికైనా కచ్చితంగా కలిగే ఫీలింగేంటంటే శంకర్ తుక్కు రేగ్గొట్టేశాడని.. ఈ రేంజి గ్రాఫిక్స్ అండ్ యాక్షన్ సీన్స్ తీయడానికి ఆ మాత్రం టైం పడుతుందని. ఇండియాలోనే అద్భుతమైన విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమా ఉంటుందని అక్షయ్ కుమార్ చెప్పేశాడు. 2.0 సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రోబో టీజర్ లా ఉంటుందని ఓ టెక్నీషియన్ అన్న మాట నిజమే అనిపిస్తుంది. ‘‘సినిమాలో గ్రాఫిక్స్ చూసి.. అబ్బా అద్భుతం అనుకోకూడదు. అది కథలో భాగమే అనుకోవాలి. అది నిజమేనని ఫీలవ్వాలి.’’ అంటూ శంకర్ ఓ మాట చెప్పాడు. నిజమే అదే అద్భుతమంటే.