ఆరుషి మర్డర్ మిస్టరీ ఏడేళ్లుగా మీడియాలో హాట్ టాపిక్. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ దారుణం జరిగింది. ఇప్పుడు ఈ మర్డర్ మిస్టరీ వెండితెరకెక్కింది. సినిమా పేరు 'తల్వార్'. ఈ సందర్భంగా ఓ రియల్ మర్డర్ మిస్టరీని విశాల్ భరద్వాజ్ ఎలా రాసి ఉంటారు అన్న డిష్కసన్ సాగుతోంది. పైగా ఈ సినిమా కోసం ఏకంగా తల్వార్ ఫ్యామిలీ చుట్టాలూ.. ఆరుషి స్నేహితులు.. అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాలో ఏం చెప్పుంటారు అనేదే అందరి వెయిటింగ్.
ప్రముఖ రచయిత లిరిసిష్ట్ గుల్జార్ తనయురాలు మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి కథ అందించడమే కాకుండా సంగీతం కూడా అందించారు. నిర్మాతగానూ కొనసాగుతున్నారు. అయితే ఓ లైవ్ మర్డర్ మిస్టరీని తెరపై వివాదాస్పదం కాకుండా ఎలా చూపిస్తారన్నదే హాట్ టాపిక్. ఆరుషి హత్య.. పూర్తిగా పరువు హత్య అన్న ప్రచారం సాగింది. 14 ఏళ్ల ఆరుషి 45 ఏళ్ల హేమరాజ్ అనే పనివాడితో (ఇంట్లో పనిమనిషి) అసభ్యంగా కనిపించి దొరికిపోవడంతో.. అది చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు ఆ ఇద్దరినీ హత్య చేశారన్నది ప్రధాన అభియోగం. ఈ విషయాన్నే సీబీఐ దర్యాప్తులో నిర్ధారించి ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. రాజేష్ తల్వార్ - నుపూర్ తల్వార్ ఆరుషి తల్లిదండ్రులు. ఈ ఇద్దరూ వైద్యులే. ఆరుషి హత్యానంతరం జరిగిన దర్యాప్తులో ఆరుషిని గొంతు కోసి చంపింది వైద్యం తెలిసిన వారేనని తేలింది. దాంతో అనుమానం ఆరుషి తల్లిదండ్రలపైనే అంటూ సీబీఐ ధృవీకరించి జీవితకైదు విధించింది.
ఆరుషి బెడ్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉంది. ఆ మరుసటి రోజే ఇంట్లో పనిమనిషి హేమరాజ్ కూడా హత్యకు గురయ్యాడు. ఆరుషిలానే అతడిని కూడా గొంతు కోసి చంపారు. ఇదంతా సీబీఐ విచారణలో తేలిన నిజాలు. అయితే వీటన్నిటినీ ఓ ప్రత్యేకమైన స్ర్కీన్ ప్లే పద్ధతిలో తెరపై ఆవిష్కరిస్తున్నారు. సీబీఐ అధికారిగా ఇర్ఫాన్ ఖాన్ నటించాడు. ఆరుషి తల్లి పాత్రలో కొంకణా సేన్ - తండ్రిగా నీరజ్ కబి నటించారు. ఈరోజే ఈ సినిమా విడుదలవుతోంది. అయితే సినిమాలో సిబిఐ కనిపెట్టిన యాంగిల్ కాకుండా.. ఫ్యామిలీ ఇచ్చిన వివరాలే ఎక్కువగా ఉన్నయాట. అది సంగతి.