సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆల్రెడీ రిలీజ్ కావాల్సిన సినిమాలు లైన్ లో ఉండగానే కొత్త సినిమాలు ఓకే చేసేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఓవైపు హీరోగా మరోవైపు విలన్ గా ఇలా విభిన్నమైన పాత్రలు చేస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంటున్నాడు. సైరా నరసింహారెడ్డి సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసాడు సేతుపతి. ఆ సినిమాతో తెలుగు మాత్రమే కాకుండా హిందీ కన్నడ మలయాళం ఇండస్ట్రీలకు కూడా విజయ్ పరిచయమయ్యాడు. మక్కల్ సెల్వన్ గా పాపులర్ అయిన విజయ్ సేతుపతి.. 2021 సమ్మర్ మొత్తం తనదే అంటున్నాడు. ఎలా అంటే ఈ సమ్మర్ లో విజయ్ సేతుపతి నటించిన 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఈ వేసవిలో మాస్టర్ భవాని సందడి మాములుగా ఉండేలా లేదు. విజయ్ నటించిన నాలుగు సినిమాలు లాభమ్, మామణిదన్, తుగ్లక్ దర్బార్, 'యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్` సినిమాలు కోలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలకు సిద్ధమయ్యాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతికి క్రేజ్ చూస్తుంటే.. తెలుగులో కూడా ఈ నాలుగు సినిమాలు అనువాద చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవేగాక విజయ్ సేతుపతి ఇదివరకు నటించి విడుదల చేసిన తమిళ సినిమాలు.. జుంగా, ఒరు నల్లనాల్ పాతు సోల్రేన్ సినిమాలు.. తెలుగులో విక్రమార్కుడు, 'ఓ మంచిరోజు చూసిచెప్తా` అనే టైటిల్స్ తో మార్చ్ 5న, మార్చ్ 19న డబ్బింగ్ సినిమాలుగా విడుదల అవుతున్నాయి. మరి ఎప్పుడో వచ్చిపోయిన ఈ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుంటే.. ఇప్పుడు తెరకెక్కిన కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతాయని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో మక్కల్ సెల్వన్ హవా సమ్మర్ లో కనిపించనుంది.