ఫోటో స్టోరీ: సూపర్ స్టార్ ఆంటీ

Update: 2020-01-14 11:04 GMT
బాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది హాటు భామల్లో మలైకా అరోరా ఒకరు. అయితే యాభైలకు దగ్గర పడుతున్నప్పటికీ బికినీ బ్యూటీగా చెలామణీ కావడం ఎంత కష్టమనేది మాటల్లో వర్ణించలేం.  యోగాతో పాటు సరైన రీతిలో ఆహరం తీసుకోవడం లాంటివి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే అది సాధ్యం.  ఈ భామ అవన్నీ ఎడాపెడా చేసిపారేస్తుంది.  అందుకే అంత ఫిట్టుగా ఉంది. మరి ఫిట్టుగా ఉన్నప్పుడు సోషల్ మీడియాను షేక్ చెయ్యకపోతే ఎలా?

అందుకే మలైకా రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లకు స్వీట్ సర్ ప్రైజులు ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా మలైకా ఒక ఫోటో షూట్ చేసింది ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ఈ ఫోటోలకు "రీ పోస్ట్ @ఎంటీవీ ఇండియా #సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలలో బ్లాక్ ప్యాంట్.. బ్లాక్ టాప్ ధరించి.. పైన బటన్స్ లేని చందనం రంగు కోటు ధరించింది.  ఒత్తుగా దువ్విన జుట్టు.. మెడలో సన్నని నెక్లెస్ లు ధరించింది.   హై హీల్స్ కూడా ధరించింది. అసలే మలైకం కాబట్టి గ్లామరసం కూడా ఒలికించింది. నిలుచున్న స్టైల్.. బాడీ లాంగ్వేజ్ అంతా సూపర్ మోడల్ లాగానే ఉంది.  మలైకా అనవసరంగా ముంబైలోనే సెటిల్ అయింది కానీ ప్రియాంక చోప్రా లాగా అమెరికాలో వాలిపోయి ఉంటే ఈ పాటికి లేటు వయసు గ్లోబల్ సుందరి అయి ఉండేదేమో మరి.

ఈ ఫోటోలకు దియా మిర్జా.. సోఫీ చౌదరి లాంటి హాటు భామలు లైక్ వేసుకున్నారు.  సాధారణ నెటిజన్లు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు.  ఒకరు "సూపర్ స్టార్ ఆంటీ" అన్నారు.. "సీరియస్లీ స్టన్నింగ్" అన్నారు.  మలైకాకు ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేవు కానీ సోనీ టీవీ లో ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది.


Tags:    

Similar News