ఫోటో స్టోరీ: 43లో ఎన్ని ఒంపులో

Update: 2017-05-28 04:37 GMT
మలైకా అరోరా పేరు చెప్పగానే.. పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక అంటూ చేసిన సందడి గుర్తుకు రావడం ఖాయం. అంతకు ముందే మహేష్ బాబు అతిథి మూవీలో 'రాత్రయిన నాకు ఓకే.. పగలైతే డబుల్ ఓకే' అంటూ ఆడిపాడింది కూడా. టాలీవుడ్ జనాలకు మలైకా అందాలతో ఇంతవరకే పరిచయం కానీ.. బాలీవుడ్ లో మరెన్నో ఐటెం సాంగ్స్ లో నర్తించి.. పాత్రల్లో నటించి మెప్పించింది.

ఇప్పుడీ భామ వయసు 43 సంవత్సరాలు. అంత స్పెషల్ గా వయసు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే.. ఈ ఏజ్ లో కూడా తన ఒంపుసొంపులను కాపాడుకుంటున్న తీరు అద్భుతం అనాల్సిందే. తాజాగా కరణ్ జోహార్ తన 45వ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద పార్టీ ఇచ్చాడు. ఈ బర్త్ డే బాష్ కి హాజరైన మలైకా గెటప్ చూసి చాలామంది అక్కడే కెవ్వుకేకలు పెట్టేశారు. బ్యాక్ అందాలను మొత్తం చూపిస్తూ.. డ్రెసింగ్ చేసుకురావడమే కాదు.. వాటిని కెమేరాలకు చూపిస్తూ తెగ పోజులు ఇచ్చేసింది. వీటిలో అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా నందాతో కలిసి మలైకా ఇచ్చిన పోజ్ ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది.

కుటుంబపరంగా సమస్యలు.. భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకుల కారణంగా రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మలైకా.. అలాగని అభిమానులకు దూరం కాలేదు. ఎప్పటికప్పుడు ఇలాంటి అద్భుతమైన ఫోటోలతో ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News