మ‌లైకా పూల్ సైడ్ త‌డి పొడి అందాల ఫెస్ట్

Update: 2021-01-03 11:30 GMT
గ‌త కొంత‌కాలంగా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం సిస్ట‌ర్ అమృత అరోరాకి చెందిన‌ గోవా విలాసంలో చిలౌట్ చేస్తోంది మ‌లైకా అరోరా. త‌న‌తో పాటే బోయ్ ఫ్రెండ్ అర్జున్ క‌పూర్ గోవా 5 బీహెచ్ కే ఇంటికి చేరి ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.

ప్ర‌స్తుతం మ‌లైకా- అర్జున్ సెలబ్రేష‌న్ ‌కు సంబంధించిన ఫోటోల‌తో అంత‌ర్జాలం హీటెక్కిపోతోంది. ముఖ్యంగా మ‌లైకా పూల్ సైడ్ ట్రీట్ కి సంబంధించిన ఫోటోలు మంట‌లు పెట్టేస్తున్నాయి. ఇంత‌కుముందు అదిరిపోయే యోగా భంగిమ‌ల్ని.. గ్రీనరీ ఫోటోషూట్ ని షేర్ చేసిన మ‌లైకా తాజాగా స్విమ్మింగ్ చేస్తూ టూపీస్ లో వేడెక్కించే ఫోజిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.

మలైకా అరోరా పూల్ సైడ్ ట్రీట్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. నూత‌న సంవ‌త్స‌రంలో అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఇక తన అభిమానులు 2021 ఏడాది అద్భుతంగా గ‌డ‌పాల‌ని మ‌లైకా కోరుకుంది. గోవా -కండోలిమ్ బీచ్ ఏరియాలోని సోదరి అమృత అరోరా  కొత్త హాలిడే హోమ్ లో బస చేయ‌డం అర్జున్ కి కూడా పెద్ద‌ ప్ల‌స్ అయ్యింద‌ట‌. అత‌డు కూడా షూట్ కి సెల‌వ్ అంటూ మ‌లైకా కోసం గోవా బీచ్ ట్రీట్ కి విచ్చేశాడు. ఈ జంట ఫోటోలు కూడా ఇప్ప‌టికే విరివిగానే వైర‌ల్ అయ్యాయి.

తాజాగా మ‌లైకా అభిమానుల కోసం ఆదివారం స్పెష‌ల్ ట్రీట్ ని ప్లాన్ చేసిందిలా. బ్లాక్ అండ్ ఎల్లో బికినీలో ఆమె పూల్ నుండి బయటకు చూస్తున్న ఫోటో శ‌ర‌వేగంగా వైర‌ల్ అయ్యింది. ఈ పోస్ట్ ‌కు ఒక గంటలోపు 127000 కంటే ఎక్కువ లైక్‌లు 1000 కి పైగా వ్యాఖ్యలు వచ్చాయి.

మలైకాతో పాటు ప్రియుడు అర్జున్ కపూర్ మరికొందరు స్నేహితులు ఈసారి పార్టీలో ఉన్నారు. అమృతా.. ఆమె భర్త షకీల్ లడక్ .. వారి ఇద్దరు పిల్లలతో హాలిడే హోమ్ లో చేరారు.

కరోనావైరస్ మహమ్మారి సమయంలో ముందు జాగ్రత్త చర్యగా మలైకా - అర్జున్ ఎక్కువగా గోవాలో ఇంటి లోపలే టైమ్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఈ జంట‌కు ఇంతకుముందు వైరస్ పాజిటివ్ రావ‌డంతో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఇలా ఇంట్లోనే దిగ్బంధనంలో ఉండిపోతున్నార‌‌ట‌. కొత్త సంవత్సరం ..... 2021 ఎటర్నల్లీగ్రాఫుల్ అంటూ మలైకా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది.


Tags:    

Similar News