మ‌త్తెక్కించే మ‌లైకం ఆ ఫ్యాష‌న్ హంగామా వేరులే!

Update: 2020-10-10 12:10 GMT
బాలీవుడ్ బాంబ్ షెల్ మ‌లైకా అరోరా ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ బారిన ప‌డి కోలుకున్న‌ విష‌యం తెలిసిందే. తన‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆసుప‌త్రిలో చేరిన మ‌లైకా ఎట్ట‌కేల‌కు చికిత్స పూర్తి చేసుకుని క్షే‌మంగా ఇంటికి తిరిగి వ‌చ్చింది. కోవిడ్ ‌కి ముందు కోవిడ్ త‌ర్వాత త‌న లైఫ్ ని డివైడ్ చేయాలి అనుకుంటే ఆవిడ మాత్రం ఎక్క‌డా ఎందులోనూ త‌గ్గ‌డం లేదు.

ఈరోజు ఉద‌య‌మే జాగింగ్ చేస్తూ చ‌లాకీగా ఉన్న ఫోటోలు లీక‌య్యాయి. ఇంత‌లోనే మ‌లైకా థ్రోబ్యాక్ వీడియోలు అంత‌ర్జాలాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇదివ‌ర‌కూ అయితే ఎవ్రీడే టైట్ ఔట్ ఫిట్ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తూ రెగ్యుల‌ర్ వ‌ర్క‌వుట్ ల కోసం జిమ్‌కి వెళుతూ ఫొటోల‌కు పోజులిచ్చే మ‌లైకా గ‌త ప‌ది ప‌ది హేను రోజులుగా కోవిడ్ సోక‌డంతో సైలెంట్ అయిపోయింది. కానీ ఇంత‌లోనే సీన్ మొత్తం మార్చేసింది మ‌లైకం.

తాజాగా త‌న‌కి కరోనా త‌గ్గ‌డంతో మ‌ళ్లీ త‌న రెగ్యుల‌ర్ వ‌ర్క‌వుట్ ‌ల‌కి ప‌ని చెప్పేసింది. ఇన్ స్టాలో తాజాగా హీటెక్కించే లుక్ ‌ని రివీల్ చేసింది. ఎల్లో క‌ల‌ర్ లెహెంగాలో మిళ మిళ మెరుస్తున్న మ‌లైకా అందాల‌కు నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు. స్టైలిస్ట్ మ‌లైకా హ‌రిసింఘానీ స్టైల్ .. త‌రుణ్ త‌హ‌ల్యానీ డిజైన్ చేసిన ఎల్లో క‌ల‌ర్ లెహెంగా దానిపై దుప‌ట్టా ధ‌రించి నెక్ ‌కి అదిరే నెక్లెస్ తో మ‌లైకా హోయ‌లు పోతోంది.

సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో ఎల్లో క‌ల‌ర్ లెహెంగాలో మెరిసిపోతూ ఇంట‌ర్నెట్‌ని హీటెక్కిస్తున్న ఈ ఫొటోల‌ని చూసిన నెటిజ‌న్స్ అంతా మ‌లైకా టెర్రిఫిక్ క‌మ్ బ్యాక్ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. మ‌రోవైపు మ‌లైకా వీడియో షూట్ కూడా అంతే వైర‌ల్ అయిపోతోంది.
Tags:    

Similar News