ఇప్పుడు బాలీవుడ్ మీడియా అంతా కూడా ఒక విషయం గురించి తెగ చర్చించేస్తున్నారు. అసలు విడాకులు తీసుకున్న తరువాత కూడా సుజానే ఖాన్ అటు హృతిక్ రోషన్ తో ఎందుకు తిరుగుతోంది.. ఇటు మలైకా అరోరా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ తో ఎందుకు తిరుగుతోందనే. ముఖ్యంగా మలైకా అయితే.. ఫారిన్ వెకేషన్ల పేరుతో హాటు హాటు ఫోటోలు షేర్ చేస్తూ 43 ఏళ్ళ వయస్సులో కూడా పిచ్చెత్తిస్తోంది. విడిపోయాక మొగుడి దగ్గర నుండి వచ్చిన డబ్బుతో ఇలా జల్సాలు చేస్తోందనే కామెంట్లు ఎదుర్కొంటోంది. అసలు తన మాజీ గయ్ తో ఎందుకు తిరుగుతోందో మలైకా ఇప్పుడు చెప్పేసిందిలే.
''మేం విడిపోయినా కూడా.. అర్భాజ్ నా పిల్లాడికి తండ్రి. నా చెల్లి అమ్రితకు ఒక అన్నయ్య. నా తల్లిదండ్రులకు ఒక కొడుకు. ఇప్పుడు మేం విడిపోయాం కదా అని అక్కడ ఫ్యామిలీ సమీకరణాలను మార్చలేం కాదా. ఎప్పటికీ అర్భాజ్ ఫ్యామిలీలో నేను.. మా ఫ్యామిలీలో అర్బాజ్ ఉంటాం. కాకపోతే మేం విడిపోవడం అనేది బాధాకరమే. కాని ఎందుకు విడపోయామో మాకు మాత్రమే తెలుసు'' అంటోంది మలైకా అరోరా ఖాన్. ఇప్పటికీ తన సోషల్ మీడియా ఎకౌంటులో ఖాన్ అనే ఇంటిపేరును తీసేయకపోవడం వెనుక కూడా ఇదే కారణమట. తను మొన్న అర్బాజ్ 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఇచ్చిన పార్టీలో సందడి చేయడంలో పెద్ద వింతేం లేదు అంటోంది. మా ఆయన కానంతమాత్రాన వెళ్ళకూడదని లేదు.. తను నా స్నేహితుడు కూడా అని చెప్పింది.
మొన్ననే తన 15 ఏళ్ళ కొడుకు అర్హాన్ తో కలసి అమ్మడు అమెరికా టూర్ వెళ్ళొచ్చింది. అక్కడ ఐఫా అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న తరువాత అమ్మడు న్యూయార్కులో షాపింగ్ చేస్తూ హాటు హాటుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ టైములో పక్కనే తన కొడుకు కూడా ఉన్నాడులే. అది సంగతి.