మ‌లైకాకు యోగిని విన్యాసాలు ఒక వ్య‌స‌నం

Update: 2020-10-17 05:00 GMT
మ‌లైకా సోద‌రి అమృత అరోరా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కంగ‌న‌కు రంగోలిలా.. క‌రీనాకు క‌రిష్మాలా.. మ‌లైకాకు అమృత అలా అన్న‌మాట‌. అయితే ఫిక‌ర్ ఏంట‌ట‌? అని ప్ర‌శ్నిస్తే దానికి ఆన్స‌ర్ ఏంటో చూడాలి.

తాజాగా మలైకా అరోరాను ఒక `యోగిని` అని వ‌ర్ణిస్తూ తన సోదరి యోగాస‌నాన్ని పంచుకుంది అమృత‌. ఈ విద్య‌లో త‌న సోద‌రి వ్యసనప‌రురాలు అంటూ చెప్పుకొచ్చింది. యోగా జిమ్ మెడిటేష‌న్ అంటే మ‌లైకానే త‌లుచుకుంటారంతా. ఈ విష‌యాన్ని అమృత వెల్ల‌డించింది. యోగా చాప‌కు అతుక్కుపోయేంత వ్య‌స‌న‌ప‌రురాలు అనేసింది.

ప్ర‌స్తుతం మ‌లైకా అరోరా యోగా ఫీట్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అరోరా తన తాజా వ్యసనానికి ఫిట్నెస్ కనెక్షన్ ఉంది.ఈ ఫోటోలో మలైకా చాప మీద కూర్చుని ఆసనానికి రెడీ అవుతోంది. దానిని సోదరి అమృత కెమెరా చట్రంలో బంధించింది. మ్యాట్ పై `యోగిని` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చేసింది. అరోరా సోదరీమణులు ఫిట్ నెస్ అంటే ప‌డి చ‌స్తార‌న‌డానికి ఇంత‌కంటే ప్రూఫ్ అవ‌స‌రం లేదు. COVID కి ముందు వ్యాయామ సెషన్ కు వెళ్లేటప్పుడు తరచుగా ఇద్దరూ కలిసి కనిపించారు. ఇప్పుడు, తరచూ మలైకా తన సోదరి తో క‌లిసి ఫిట్నెస్ సెష‌న్స్ లో పాల్గొంటోంది.

ఇటీవల మలైకా COVID 19 నుండి కోలుకొని తిరిగి పనిలోకి చేరింది. ఇండియాస్ బెస్ట్ డాన్సర్ టీవీ కార్య‌క్ర‌మం న్యాయమూర్తుల ప్యానెల్ ‌లో మ‌లైకా ఒక‌రు. ఆరోగ్యం ప‌రంగా కోలుకుని తిరిగి పనికి రావడానికి సంతోషిస్తున్నాన‌ని మ‌లైకా తెలిపింది. మ‌లైకా లేని స‌మ‌యంలో నోరా ఫతేహి టెరెన్స్ లూయిస్ మరియు గీతా కపూర్ లతో డ్యాన్స్ షోకి తీర్పు చెప్పే బాధ్యతను స్వీకరించారు. ఇటీవల.. ఫరా ఖాన్ ఈ కార్యక్రమానికి గెస్ట్ న్యాయమూర్తిగా హాజరయ్యారు. మలైకా తన వానిటీ వ్యాన్లో ఇతర జ‌డ్జీల‌తో క‌లిసి ఫుడ్ తింటున్న ఫోటోలు రివీల‌య్యాయి.
Tags:    

Similar News