బాలీవుడ్ లో లవ్ జంటలు చాలానే ఉన్నాయి కానీ వారందరిలో క్రేజీ కపుల్ మాత్రం మలైకా అరోరా-అర్జున్ కపూర్ జంటే. కారణం అందరికీ తెలిసిందే. మలైకా వయసు 46.. అర్జున్ జస్ట్ 34. అర్బాజ్ ఖాన్ తో మలైకా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మలైకాకు ఇప్పుడు టీనేజ్ వయసు కొడుకు ఉన్నాడు. సరే.. మీరు బియ్యంలో పురుగులు ఏరుతూ హవ్వ.. ఇదేం జోడీ అనే పక్కింటి ఆంటీలా అవాక్కవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే బోనీ కపూరే తనకు కాబోయే పెద్ద వయసు కోడలి పట్ల అనుకూలంగానే ఉన్నారట. ఆయనకు లేని అవాక్కు మనకెందుకు?
మలైకా-అర్జున్ లు చాలాకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమలోకాలలో విహరిస్తూ ఉన్నారు. బాలీవుడ్ మీడియా కూడా వారి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ జనాలు ముఖ్యమైన విషయాలు మిస్ కాకుండా చూస్తోంది. అయితే ఇప్పటివరకూ ఇద్దరూ లవ్ ఎఫైర్ గురించి హింట్స్ ఇస్తూ వచ్చారు కానీ ఓపెన్ గా ఎప్పుడూ మాట్లాడలేదు. రీసెంట్ గా ఒక చాట్ షోలో మలైకా ఎంతో ఓపెన్ గా అర్జున్ తో తన మ్యారేజ్ ప్లాన్స్ గురించి ఓపెన్ గా వెల్లడించింది. డ్రీమ్ వెడ్డింగ్ గురించి మాట్లాడుతూ అది బీచ్ వెడ్డింగ్ అయి ఉండాలట. అయితే సాదాసీదా బీచ్ కాదు. తెలుపురంగు ఇసుక ఉండే ఒక అందమైన బీచ్ లో వివాహం చేసుకోవాలని ఉందట. ఇక మలైకాకు ఒక గర్ల్స్ గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ తనకు తోడిపెళ్ళికూతుళ్ళ తరహాలో పక్కనే ఉండాలట.
ఈ లేటు వయసు బ్యూటీ జోరు చూస్తుంటే అతి త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు రెడీ అయ్యేలా ఉంది. ఇది చదివే సంప్రదాయవాదులలో ఎవరైనా బలహీనమైన గుండె ఉండేవారు ముందే గుండెను దిటవు చేసుకోండి.. లేకపోతే రేపు పుసుక్కున 'మలైకం పెళ్ళి చేసుకుంది' అనే వార్తను తట్టుకోలేరు. సరే అసలు పాయింట్ చర్చ ముగిసింది. కొసరు పాయింట్ ఏంటంటే మలైకా అర్జున్ కు తీసే ఫోటోలు అర్జున్ ఏమాత్రం నచ్చవట. ఆది నిజమేనని తన ఫోటోలు అర్జున్ అందంగా తీస్తాడని.. వాటితో పోలిస్తే తను తీసే ఫోటోలు అంతగా బాగోవని చెప్పుకొచ్చింది. మలైకాపురాణం ఇంతటితో సమాప్తం!