కరోనా అంతా మార్చేసింది. ప్రపంచాన్ని గజిబిజి గందరగోళంలోకి నెట్టేసింది. ముఖ్యంగా సినీపరిశ్రమల పరిస్థితి అయోమయంగా మార్చేసింది. రెండేళ్లుగా ఈ పరిస్థితి నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది. కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ప్రతి ఒక్కరి జీవితాలను జీవనశైలిని తలక్రిందులు చేసింది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రజలు మాస్క్ ధరించకుండా బయటకు వెళ్లడం లేదు. మాస్క్ వేయకపోతే నగ్నంగా ఉన్నట్టు ఫీలవుతున్నానని కామెంట్ చేసింది హాట్ గాళ్ మాళవిక మోహనన్.
తాజా ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ -మేము షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్స్‌లో కఠినమైన భద్రతా ప్రోటోకాల్ ని అనుసరిస్తున్నాం. కానీ నటులు మాస్క్ లు తీసివేయాలి. నేను మాస్క్ ని రెగ్యులర్ గా ధరించడం అలవాటు చేసుకున్నాను. ఇంతలోనే అకస్మాత్తుగా ఆ ఒక్కటీ లేకుండా నగ్నంగా ఉన్నాను. అంతగా మాస్క్ మన వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం అయింది కనుక దాన్ని తీసివేసినప్పుడు వింతగా అనిపిస్తుంది`` అని అంది.
విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటించింది మాళవిక మోహనన్. వేడెక్కించే అందాలతో ఈ బ్యూటీ యువతరం మనసు దోచింది. ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న మారన్ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉంది. కార్తీక్ నరేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆగిపోయిన హీరో సినిమా గురించి చూడా ప్రస్థావించింది మాళవిక.
``దేవరకొండతో `హీరో` నా టాలీవుడ్ అరంగేట్రం అనుకున్నారు కానీ అంతర్గత సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. నేను గత కొంత కాలంగా తెలుగు సినిమాలోకి అడుగుపెట్టాలని ఎదురు చూస్తున్నాను. వాస్తవానికి నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి కానీ మహమ్మారి కారణంగా వెయిటింగ్ తప్పడం లేదు. ఒకటిన్నర సంవత్సరాల బకాయి పడి ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మారుతున్నాయి. నన్ను త్వరలో తెలుగు సినిమాలో చూస్తారు`` అని మాళవిక అన్నారు. ఈ బ్యూటీ తెలుగు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడేందుకు ఆస్కారం ఉందని కొద్దిరోజులుగా కథనాలొస్తున్నాయి.