హిమాల‌యాల బాట ప‌ట్టిన స్టార్ హీరోయిన్

Update: 2020-10-16 15:30 GMT
ఓవైపు మ‌నాలి - ల‌ఢాఖ్ బార్డర్ లో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. అటువైపు నుంచి చైనా బ‌ల‌గాలు బార్డ‌ర్ దాటి ఇండియాలో ప్ర‌వేశించేందుకు దాడుల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇటువైపు నుంచి మ‌న సైనికులు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎటువైపునా ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. తాడో పేడో తేల్చాల్సిందే అన్న‌ట్టు ఉంది ప‌రిస్థితి. మ‌ధ్య‌లో సైనిక పెద్ద‌లు మంత‌నాలు సాగిస్తున్నా.. ఏవీ ఫ‌లించ‌డం లేదు.

స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో ఆవిడ హిమాల‌యాల ప‌ర్య‌ట‌న‌కు వెళ‌తానంటోంది. అది కూడా హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకున్న చైనా బార్డ‌ర్ అయిన ప్యాంగ్ యాంగ్ లేక్ ... కి స‌మీపంలోని 18000 అడుగుల ఎత్తున ఉన్న ల‌ఢాక్ కి వెళుతుంద‌ట‌. అంతేకాదు.. అక్క‌డ త‌న రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని పార్క్ చేసి ఇదిగో నా సాహ‌సం అంటూ వీర‌లెవ‌ల్లో ఫోజిచ్చిన ఫోటోని షేర్ చేసింది మ‌ల్లూ బ్యూటీ మాళ‌‌విక మోహ‌న‌న్. ఈ మ‌ల్లూభామ‌కు ప్ర‌తిసారీ హిమాల‌యాల్లో బైక్ రైడ్ చేయ‌డం అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అప్పుడ‌ప్పుడు కార్ లో కూడా ఇక్క‌డికి వ‌చ్చి వెళుతుంటాన‌ని చెప్పింది. ఈ రైడ్ అంటే ప‌డి చ‌స్తాన‌ని అంటోంది.

లఢాఖ్ అద్భుతమైన ప్రకృతి సౌంద‌ర్యంతో అల‌రారే అరుదైన ప్లేస్. హిమాల‌యాల్లో మంచు కురియ‌డం ఇప్పుడిప్పుడే తీవ్ర‌త‌రం అవుతుంటుంది. న‌వంబ‌ర్ నాటికి ఫుల్ స్వింగులోకి వ‌చ్చేస్తుంది మంచు దుప్ప‌టిలాగా. అక్క‌డ‌ స్వారీ చేసిన నా అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాలను నేను ఆనందించాను అని చెబుతోంది మాళ‌విక‌. గత కొన్ని సంవత్సరాలుగా శక్తివంతమైన హిమాలయాల్ని బైక్ ‌తో అన్వేషించడం అల‌వాటు. షాకిర్లు చేయ‌డానికి ఇష్టమైన ప్రదేశమిది. బైక్ లేదా కార్ లో ప్ర‌యాణం బావుంటుంది అని తెలిపింది.

బైక్ జ‌ర్నీ అయితే ఇక్క‌డ స్వ‌చ్ఛ‌మైన‌ గాలి తీసుకోవడం బావుంటుంది. నా ముఖం మీద గాలి త‌గులుతుంది. కొన్నిసార్లు వడగళ్ళు తాకిన‌ అనుభూతి క‌లుగుతుంది. ఆడ్రినలిన్ రష్ చాలా ఎక్కువ. సజీవంగా నేను ఎప్పుడూ ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని మాళ‌విక తెలిపింది. అన్న‌ట్టు మాళ‌విక ఇప్పుడే అక్క‌డికి వెళ్లిందా? అంటే అబ్బే లేద‌ట‌. అది త్రోబ్యాక్ ఫోటో అని చివ‌ర్లో చెప్పింది. అక్క‌డ ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తే తాను బైక్ పై వెళ్లేందుకు సిద్ధంగా ఉంద‌ట‌.. ట్విస్టు అదిరింది క‌దూ!! మాళ‌విక ప్ర‌స్తుతం విజ‌య్ స‌ర‌స‌న మాస్ట‌ర్ అనే చిత్రంలో న‌టిస్తోంది. ప‌లు భారీ చిత్రాల‌కు సంత‌కాలు చేయ‌నుందట‌.
Tags:    

Similar News