హీరో అంటే ఎవరు అని అడగ్గానే... సినిమాల్లో విలన్లను చితక్కొట్టేస్తూ - గాల్లోకి విసిరికొడుతూ - హీరోయిన్స్ తో డాన్స్ చేసేవారనేది ఎక్కువమంది చెప్పే విషయం. సమాజంలో సినిమాల్లో కనిపించే వారిలా కాకుండా.. నిజమైన హీరోలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్నతాధికారుల నుంచి - ఆఫీసు బాయ్స్ వరకూ - రిక్షా కార్మికుల్లో - వ్యవసాయ కూలీల్లో ఎందరో హీరోలు నిజజీవితంలో హీరోలుగా వెలుగొందుతుంటారు. ఇలా అన్ని రంగాల్లోనూ హీరోలు ఉన్నట్లే సినిమాల్లో నటించే ఒక నటుడు.. నిజంగానే హీరో అయిన సంఘటన తాజాగా కేరళలో జరిగింది.
తన కళ్ల ముందు జరిగిన ఒక ప్రమాదానికి కదిలిపోయిన ఆ "హీరో".. ప్రభుత్వానికి చురుకు పుట్టేలా - ప్రభుత్వపెద్దలను మేల్కొలిపేలా ఒక వీడియోను రూపొందించాడు - సోషల్ నెట్ వర్క్స్ లో దాన్ని పోస్ట్ చేశాడు. ఫలితంగా సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే స్పందించాల్సిన పరిస్థితిని కల్పించాడు. విషయానికొస్తే.. మలయాళ నటుడు జయసూర్య కేరళలో తన కార్లో వెళుతున్నప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి బైక్ పై నుండి కిందపడి గాయాలపాలయ్యాడు. అతడు కిందపడిపోవడానికి అధ్వాన్నంగా ఉన్న ఆ రోడ్డే కారణం. దీంతో కాసేపు ప్రభుత్వాన్ని - అధికారులను తిట్టేసి అందరిలాగానే వెళ్లిపోకుండా.. ఒక సెల్ఫీ వీడియో తీశాడు జయసూర్య. టాక్సులు కట్టే సామాన్యుడే ఈ గుంతల్లో పడి గాయపడుతున్నాడని, రోడ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకని.. ప్రశ్నిస్తూనే, జరిగిన ప్రమాదం గురించి వివరించారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో చేర్ చేసిన అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో షేర్లు - లక్షల సంఖ్యలో వ్యూసు వచ్చాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అటుతిరిగి ఇటు తిరిగి కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు చేరింది. ఈ వీడియో చూసిన వెంటనే స్పందించిన సీఎం - నటుడు సూర్యకు సమాధానం పంపారు. తమ ప్రభుత్వం రోడ్లపై రిపేర్లకు కట్టుబడి ఉందని, ఇప్పటికే రోడ్లకోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. తర్వాత జరిగే పరిణామాల సంగతి పక్కనపెడితే.. ఒక నటుడు ఇలా సమాజానికి పనికొచ్చే పనికి పూనుకోవడం - అందరిలాగానే అన్యాయం జరిగిన చోట - సామాన్యుడు ఇబ్బంది పడుతున్నచోటా కాసేపు అధికారులను - ప్రభుత్వాన్ని తిట్టేసిపోకుండా.. స్పందించి, రాష్ట్ర ముఖ్యమంత్రిని కదిలించడం సంతోషించాల్సిన విషయం, ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో కూడా రోడ్ల పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో దారుణంగానూ, మరికొన్ని ప్రాంతాల్లో అధ్వాన్నంగానూ ఉంది. చాలా మంది హీరోలు కార్లలో ఆ రోడ్లపైనే తిరుగుతుంటారు.. ఎవరైనా ఈ రోడ్లపై స్పందిస్తే ఎంతబాగుంటుందో కదా!!
Full View