బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని లొసుగులు బయట పడుతున్నాయి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్న నెపొటిజం ఫేవరెటిజం పై విమర్శలు చేస్తున్నారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ వారసులను మాత్రమే స్టార్స్ గా చేసేందుకు సినిమాలు నిర్మిస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోలకు సుశాంత్ లాంటి గతి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా మలయాళ యంగ్ హీరో నీరజ్ మాధవ్ ఈ విషయమై స్పందిస్తూ ఇండస్ట్రీ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు.
నీరజ్ మాధవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. కాని ఇప్పటి వరకు కూడా ఒక మోస్తరు నటుడిగా హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయిన మాధవ్ ఫేస్ బుక్ ద్వారా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హెయిర్ డ్రస్సర్ కు వస్తున్న ఆదాయం కూడా యంగ్ హీరోలకు రావడం లేదు. కొందరు సినీ ప్రముఖుల ఈగో కారణంగా మాలాంటి చిన్న హీరోల జీవితాలు నాశనం అవుతున్నాయి. 2013 నుండి ఇండస్ట్రీలో ఉన్నా కూడా నా పరిస్థితి ఏమాత్రం మెరుగు పడలేదు అన్నట్లుగా మాధవ్ పోస్ట్ పెట్టాడు. ఇండస్ట్రీ పెద్దల గురించి మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (అమ్మ) మాధవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల అందరి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని.. వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా అమ్మ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. మలయాళ సినీ వర్కర్స్ యూనియన్ కూడా మాధవన్ వ్యాఖ్యలను తప్పుబడుతు నోటీసులు జారీ చేసింది. మొత్తానికి ఈ వివాదంతో అంతంత మాత్రంగా ఉన్న మాధవన్ కెరీర్ మరింత కష్టాల్లో కూరుకు పోయే ప్రమాదం తలెత్తింది అంటూ మలయాళ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.