ప్రముఖ మలయాళ నటిపై దాడి వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్ పై కోర్టు విచారణ సాగిన సంగతి తెలిసిందే. మార్గమధ్యంలో సదరు నటిపై వేధింపులకు పాల్పడడమే గాక.. తీవ్రంగా కొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు ఫైల్ చేసిన కేరళ పోలీసులు ఇన్వెస్టిగేష్ చేశారు. ఈ కేసు కొన్నేళ్లుగా కోర్టుల పరిధిలో నలుగుతోంది.
తాజాగా హీరో దిలీప్ భార్యామణి ప్రముఖ కథానాయిక కావ్య మాధవన్ విచారణ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు 2017 ఫిబ్రవరిలో కొచ్చిలో కదిలే వాహనం నుంచి అపహరణకు గురై లైంగిక వేధింపులకు గురైన ప్రముఖ కథానాయికకు సంబంధించినది.
లైంగిక వేధింపుల కేసులో తాజా పరిణామం కావ్యా మాధవన్ విచారణ. నేడు (ఆగస్టు 10) ఎర్నాకుళం లోని కోర్టు ప్రొసీడింగ్స్ కి కావ్య హాజరయ్యారు. నటి కావ్య మాధవన్ ఈ కేసులో ఎనిమిదో నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసు విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నటిని కిడ్నాప్ చేసి దాడి చేయడానికి దిలీప్ కొందరు వ్యక్తులను నియమించాడు. ఈ వేధింపుల విజువల్స్ ను రికార్డ్ చేయాలనుకున్నాడు. కానీ నటి తప్పించుకుని పారిపోయింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అకా పల్సర్ సునీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఫోటోలను కలిగి ఉన్న మెమరీ కార్డ్ కావ్య మాధవన్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ దుస్తుల సంస్థ లక్షియా కార్యాలయంలో ఉంచినట్లు కేసు విచారణ సమయంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. 2017 లో కొచ్చిలోని లక్ష్యా ఆఫీసులో పరిశోధకులు సోదాలు జరిపారు. విచారణలో కావ్య మాధవన్ ను కూడా దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఎందుకంటే ఈ కేసులో ప్రాణాలతో బయటపడిన సదరు నటి తన మొదటి వివాహ సంబంధాన్ని బయటపెట్టినందుకు దిలీప్ అసంతృప్తిగా ఉన్నాడు. పగ తీర్చుకునేందుకే ఇలా చేశారు. మొదటి భార్య మంజు వారియర్ ఉండగా.. అతను కావ్య మాధవన్ ను పెళ్లాడారు. తను రెండో భార్య అయ్యారు.
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన 50 మందికి పైగా ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన హీరోగా దిలీప్ ప్రమేయం కేసుపై మరింతగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కేసు మలయాళ చలనచిత్ర పరిశ్రమపై భారీ ప్రభావాన్ని చూపింది. సదరు నటికి అండగా నిలిచిన వర్గం.. దిలీప్ ను సమర్థించే వర్గంగా పరిశ్‌రమ విడిపోయింది. 2017 డిసెంబర్ లో ఈ కేసులో స్టేట్ మెంట్ లు ఇచ్చిన వారిలో మంజు వారియర్- సంయుక్త వర్మ- కుంచకో బోబన్- గాయని రిమి టోమీ ఉన్నారు.
ఈ ఏడాది జూలైలో విష్ణు ఈ కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు విచారణ కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్టయ్యాడు. అతను పదవ నిందితుడు. అతడు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అప్రూవర్ గా మారారు.
మంజు వారియర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో 2015 లో తాను దిలీప్ నుంచి విడాకులు తీసుకున్నానని దానికి కారణం కావ్యతో అతడికి వివాహేతర సంబంధం ఉండడమే కారణమని చెప్పింది. మంజు కూడా ఈ అదనపు వివాహ సంబంధాన్ని బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడిన సదరు నటి ఈ గుట్టును బయటపెట్టిందన్నది తను చెప్పారు. కావ్య మాధవన్ -దిలీప్ - మంజుల మధ్య సమస్యలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తనకు తెలియదని ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. కిడ్నాప్ కేసులో ప్రాణాలతో బయటపడిన సదరు నటీమణి తో కావ్యకు సంబంధాలున్నాయి.