ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఔట్ డేటెడ్ భామ‌

Update: 2021-04-20 16:30 GMT
బోల్డ్ బ్యూటీగా బాలీవుడ్ లో ఒక సీజ‌న్ ని ఏలింది మ‌ల్లికా శ‌రావ‌త్. య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో మ‌ర్డ‌ర్ లాంటి బోల్డెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకుంది. ఆ సినిమాలో ఇమ్రాన్ హ‌స్మీతో పెద‌వి ముద్దులు రొమాన్స్ లో మ‌ల్లిక చెల‌రేగిన తీరు ద‌శాబ్ధం పాటు చ‌ర్చ‌ల్లోనే నిలిచింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ భామ‌కు వీరాభిమానులేర్ప‌డ్డారు. ఆ క్ర‌మంలోనే హాలీవుడ్ లోనూ ప‌లు క్రేజీ అవ‌కాశాలొచ్చాయి. జాకీచాన్ అంత పెద్ద స్టార్ అవ‌కాశం ఇవ్వగానే హాలీవుడ్ లో న‌టించింది. కానీ ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ఎందుక‌నో ఈ భామ న‌టించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు.

కొన్నేళ్ల పాటు త‌న బోయ్ ఫ్రెండ్ తో క‌లిసి మ‌ల్లిక విదేశాల్లో సెటిలైంది. కానీ కాల‌క్ర‌మంలో తిరిగి ముంబైకి వ‌చ్చి మ‌రోసారి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బాలీవుడ్ చుట్టూ తిరుగుతోంది. చివ‌రి ఇన్నింగ్స్ లో ఆఫ‌ర్ల కోసం సీరియ‌స్ గా ర‌క‌ర‌కాల ప్ర‌యత్నిస్తోంది. నిజానికి ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమాల్లో న‌టించాక  లోక‌ల్ ఆఫ‌ర్లు వ‌చ్చినా కానీ బెట్టు చేసింది. దాంతో ఆ అవ‌కాశాలన్నీ చేజారాయి. ఇప్పుడు లోక‌ల్ భాష‌లో కావాల‌నుకుంటున్నా ప‌రిశ్ర‌మ ముఖం చాటేస్తోంది.

చివ‌రి సారిగా హిస్ లాంటి చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం హైద‌రాబాద్ కి కూడా వ‌చ్చింది. ఆ తర్వాత ఇన్నేళ్ల పాటు గ్యాప్ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతానికి బాలీవుడ్ ఈ బ్యూటీని ఔట్ డేటెడ్ గాళ్ గానే చూస్తోంది. కానీ త‌న‌లో వాడి వేడి త‌గ్గ‌లేద‌ని ప్రూవ్ చేసేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇదిగో ఇలా లేటెస్ట్ ఫోటోషూట్ నుంచి ఛ‌మ‌క్కు లాంటి ఫోటోని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. మ‌ల్లిక డెడికేష‌న్ చూశాక క‌నీసం సౌత్ లో అయినా పిలిచి ఆఫ‌ర్ ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News