మర్డర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది మల్లికా శెరావత్. ఘాటైన పెదవి ముద్దులు బెడ్ రూమ్ సన్నివేశాల్లో జీవించేసిన మల్లికకు గొప్ప ఫాలోయింగ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. కానీ కాలక్రమంలో నటిగా ప్రభ కోల్పోయాక విదేశీ బోయ్ ఫ్రెండ్ తో యూరప్ లో సెటిలైంది. ఇటీవలే ఇండియాకి తిరిగి వచ్చేసాక తిరిగి నటిగా తనవంతు ప్రయత్నాల్లో ఉంది.
ఇన్నాళ్టికి తిరిగి వరుసగా సినిమాలు సిరీస్ లతో బిజీ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా మీడియా ఇంటర్వ్యూలతోనూ బిజీ అయ్యింది ఈ బ్యూటీ. ఒకానొక ఇంటర్వ్యూలో మల్లిక ఓ ఆసక్తికర అనుభవాన్ని చెప్పుకొచ్చింది. మల్లికా షెరావత్ తన సహనటులతో పోరాటాల గురించి మాట్లాడుతూ.. వారిలో ఎక్కువ మంది తనతో `ఇగో గొడవ`కు దిగారని అన్నారు. తాజా ఇంటర్వ్యూలో మల్లికా తన మర్డర్ కో-స్టార్ ఇమ్రాన్ హష్మీతో తన పోరాటాన్ని ఫన్నీయెస్ట్ అంటూ నవ్వేసింది.
అనురాగ్ బసు దర్శకత్వం లో ముఖేష్ భట్ నిర్మించిన మర్డర్ 2004లో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇందులో మల్లికా షెరావత్- ఇమ్రాన్ హష్మీ - అష్మిత్ పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. థాయిలాండ్ - బ్యాంకాక్ లో మెజారిటీ భాగం చిత్రీకరించారు. ఈ చిత్రం 2002 అమెరికన్ చిత్రం అన్‌ఫెయిత్ ఫుల్ ఆధారంగా తెరకెక్కింది. మర్డర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మర్డర్ 2 (2011) - మర్డర్ 3 (2013) కూడా సిరీస్ లో విడుదలయ్యాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ మందిరా బేడి తన సహ-నటులతో ఆమె గొడవల గురించి అడిగినప్పుడు మల్లిక చాలా ఫన్నీ మ్యాటర్స్ ని వెల్లడించారు. ``నాకు అలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మంది సహ నటులు నాతో అహంకారపూరితంగా గొడవకు దిగారు. సెట్లో నేను కూర్చొని ఉంటే వారు రాగానే లేచి నిలబడి ``గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు`` అని అడగాలని ఆశిస్తారు. నా సహచర మేల్ నటులపై అనవసరంగా మండిపడతారు. అయితే అది నా వ్యక్తిత్వం కాదు. నేను హర్యాన్వి జాత్ ని..బలవంతం చేస్తే నేను ఎవరినీ ఇష్టపడను. ఈ విషయంలో కొన్ని వాగ్వివాదాలు జరిగాయి.. అని మల్లిక తెలిపింది.
మర్డర్ చిత్రం తర్వాత లేదా రిలీజ్ సమయంలో ఇమ్రాన్ హష్మీతో చాలా హాస్యాస్పదమైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది మల్లిక. మేము చాలా కాలం మాట్లాడుకోలేదు. ఇప్పుడు అది చాలా చిన్నపిల్ల చర్య అని అనిపిస్తోంది. సినిమా తర్వాత ప్రమోషన్ సమయంలో మా మధ్య అపార్థం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఇది చాలా అసహ్యకరమైనది. నేను కూడా చిన్నపిల్లను. నేనేమీ తక్కువేం కాదు.. అంటూ మల్లిక కోస్టార్ హస్మీతో ఫైట్ గురించి ఓపెనైంది. ఇప్పుడు తాము టచ్ లో లేమని మల్లిక అన్నారు. ``నేను అతనితో సన్నిహితంగా లేను.. అతను చాలా స్నేహపూర్వకంగా ఉండడం వల్ల.. అతను అద్భుతమైన సహనటుడు కాబట్టి ఇది నిజంగా విచారకరం. అతను మంచి అబ్బాయి`` అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది మల్లిక.
ఇక మల్లికను తదుపరి రజత్ కపూర్ దర్శకత్వం వహించిన RK/RKAYలో చూస్తారు. ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే అమెరికాలో విడుదలైనప్పటికీ భారత్ లో విడుదల కాలేదు. అంకితా చక్రవర్తి - ఈషా గుప్తా ఇందులో ఇతర తారాగణం. అలాగే డిజిటల్ సిరీస్ అయిన నకాబ్ లో కూడా మల్లిక కనిపిస్తుంది. ఇమ్రాన్ ఇటీవల విడుదలైన డైబ్బక్: ది కర్స్ ఈజ్ రియల్ లో నికితా దత్తాతో కలిసి కనిపించారు. ఈ హర్రర్ మూవీలో ఇమాదుద్దీన్ షా- డెంజిల్ స్మిత్- అనిల్ జార్జ్- బిజయ్ ఆనంద్- గౌరవ్ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 29న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.