మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మళ్ళీ ఫ్లాప్స్ బాట పట్టాడు. రాజా ది గ్రేట్ సినిమాతో హిట్టు కొట్టి రికవర్ అయ్యాడని అనుకున్న ఈ హీరో మరోసారి రొటీన్ కథలతో ఇంకా తీవ్ర స్థాయిలో డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. వరుసగా టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు సినిమాలు ఊహించని విధంగా ఫెయిల్యూర్ అయ్యే సరికి మార్కెట్ లో తేడా కొడుతోంది. అయినా కూడా రవితేజ వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నాడు.
త్వరలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తేరి రీమేక్ లో నటించబోతున్నాడు. ఆ సినిమా కొంచెం భారీగానే ప్లాన్ చేశారు. ఇక ఆ తరువాత విఐ.ఆనంద్ అనే దర్శకుడితో ఒక ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఒక్క క్షణం సినిమాతో డిఫెరెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అసలు విషయంలోకి వస్తే రవితేజ - ఆనంద్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నెల టికెట్టు భామ సలెక్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి.
దర్శకుడు ఆ వార్తలను కొట్టి పారేశాడు. నెల టికెట్టు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా మాళవిక శర్మ మరోసారి రవితేజతో జత కట్టనున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇంకా హీరోయిన్ గా ఎవరిని సంప్రదించలేదని విఐ.ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. మరికొన్ని రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి అన్ని వివరాలను చెప్పనున్నట్లు దర్శకుడు చెప్పాడు. ప్రస్తుతం మాస్ రాజా అమర్ అక్బర్ అంథోని సినిమాతో బిజీగా ఉన్నాడు.