నేల టిక్కెట్లో హైబ్రిడ్ పిల్లా? కొత్త పిల్లా?

Update: 2017-12-26 11:20 GMT
బంగార్రాజు క్యారక్టర్ తో నాగార్జునకు భలే హిట్టిచ్చాడు కళ్యాణ్‌ కృష్ణ కురసాల. ఆ తరువాత రారండోయ్ వేడుక చూద్దాం అంటూ అలరించాడు. కమర్షియల్ గా ఆ సినిమా ఓకె అనిపించింది. అయితే ఈ దర్శకుడు మూడో సినిమా కూడా అన్నపూర్ణ క్యాంపులోనే అనుకుంటున్నప్పుడు.. మనోడు మాస్ రాజా రవితేజతో ఒక సినిమాను చేస్తున్నాడు. 'నేల టిక్కెట్' అనేది వర్కింగ్ టైటిల్.

అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఎవరిని ఎంచుకుంటున్నారు అనే విషయంపై పెద్ద పెద్ద చర్చలే నడుస్తున్నాయి. ఒక ప్రక్కన ఫిదాతో ఫేమస్ అయిన.. హైబ్రిడ్ పిల్ల.. సింగిల్ పీస్..  సాయి పల్లవిని తీసుకుంటారా అనే టాక్ వినిపిస్తోంది. దాదాపు సాయి పల్లవి కన్ఫామ్ అని కూడా చెబుతున్న సమయంలో.. ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది. రవితేజ ప్రక్కన మోడలింగ్ రంగం నుండి వచ్చిన మాళవిక శర్మ అనే హాట్ మోడల్ తెరంగేట్రం చేస్తోందని కథనాలు వినిపిస్తున్నాయి. కెవిన్ కేర్ - 7అప్ - హిమాలయా వంటి బ్రాండ్ల యాడ్స్ కు పనిచేసిన ఈ చిన్నది.. ఇప్పుడు రవితేజ సినిమాతో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది అంటున్నారు.

ఏదేమైనా కూడా.. రవితేజ చాలా గ్యాప్ తరువాత మరోసారి షూటింగ్ కు సన్నద్దమవుతున్నాడు. ఆయన చేతిలో ఉన్న టచ్ చేసి చూడు షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోగా.. ఇప్పుడు ఈ కొత్త సినిమా మొదలవ్వాల్సి ఉంది. అది సంగతి.



Tags:    

Similar News