సూపర్‌స్టార్ మహేష్ నటించిన 'సర్కారు వారి పాట' విజయోత్సవ వేడుకలు హోరెత్తుతున్నాయి. ఈ సోమవారం సాయంత్రం కర్నూల్ లో స్పెషల్ గా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది టీమ్. అయితే ఈ వేదికపై ఆ వింత గురించి ఇప్పుడు అభిమానుల్లో ముచ్చట సాగుతోంది.
నిజానికి ఎప్పుడూ కూల్ గా ఉండే మహేష్ ఈసారి అందుకు భిన్నంగా జోష్ ని ప్రదర్శిస్తూ మా మా మహేషా మాస్ సాంగ్ కి స్టెప్పులేశారు. డ్యాన్సర్ల బృందం వేదికపై ఈ పాటకు స్టెప్పులేస్తుండగా మహేష్ ని ఆహ్వానించారు. అతడు నడిచి అలా వేదికపైకి వస్తూనే వారితో స్టెప్పు కలిపాడు. ఇక మహేష్ చెంతనే ఉన్న థమన్ సైతం అతడితో కలిసి కాలు కదిపాడు.
ఈ దృశ్యం చాలా అరుదైనది. మహేష్ నుంచి ఇలాంటివి ఆశించలేం. అతడు ఇలాంటి వేదికలపై ఎంతో హుందాగా అలా మాట్లాడి ఇలా వెళ్లిపోతుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా కర్నూల్ వేదికపై చిన్నపాటి స్టెప్పేసి అభిమానుల్ని అలరించాడు. స్వతహాగా అంతర్ముఖుడైన మహేష్ ఇలా వేదికపై స్టెప్పులేయడం ఆసక్తికరం. ఇక ఇదే వేదికపై డైరెక్టర్ పరశురామ్ కూడా ఎంతో జోష్ తో కనిపించారు. నిజానికి సర్కార్ వారి పాటకు ఆరంభం డివైడ్ టాక్ వచ్చినా భారీ రిలీజ్ ప్లానింగ్ కలిసొచ్చిందన్న టాక్ ఉంది.
త్రివిక్రమ్ - రాజమౌళితో బిగ్ ప్లానింగ్ తదుపరి మహేష్ పరిశ్రమ అగ్ర దర్శకులతో పని చేయనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో సినిమా అనంతరం రాజమౌళితో భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఓవైపు దర్శకధీరుడు రాజమౌళితో సినిమా గురించి చర్చిస్తూనే .. త్రివిక్రమ్ తో మూవీని పట్టాలెక్కించేందుకు మహేష్ సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది.
మహేష్ నటించే 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. SSMB28 రెగ్యులర్ చిత్రీకరణ జూలై నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ ని లాక్ చేసారు. ఇక ప్రీప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. జూలైలో చిత్రీకరణను ప్రారంభించి డిసెంబర్ నాటికి టాకీ మొత్తం పూర్తి చేయాలన్నది ప్లాన్. 2023 సంక్రాంతి విడుదల లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సర్కార్ వారి పాట ఒక టిఫికల్ లైన్ తీసుకుని లైటర్ వెయిన్ లో తెరకెక్కించారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక తదుపరి త్రివిక్రమ్ కూడా ఇంచుమించి మహేష్ లోని మాస్ ని క్లాస్ ని ఎలివేట్ చేస్తూ ఓ మాంచి క్లాసికల్ సినిమా తీస్తారన్న టాక్ వినిపిస్తోంది.
బహుశా ఈ సినిమా ప్రయోగం కాకపోవచ్చు. తదుపరి రాజమౌళితో సినిమా అత్యంత భారీ కాన్వాస్ తో ఉంటుంది. ఇది పాన్ ఇండియా కేటగిరీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమా అవుతుంది.
Full View