ఇరుగు పొరుగు భాషల్లో అగ్ర హీరోలు సైతం టాలీవుడ్ లో క్యారెక్టర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మోహన్ లాల్, యాక్షన్ కింగ్ అర్జున్, సత్యరాజ్, రెహమాన్ అంతటి పెద్ద స్టార్లు సైతం తెలుగు సినీపరిశ్రమలో వచ్చే ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. మన జగపతిబాబు సైతం టాలీవుడ్‌లో ఇరుగు పొరుగు భాషల్లో విలన్ పాత్రల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం ఎప్పుడూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు ఆసక్తి చూపించలేదు.
అందుకే `స్వాతి కిరణం` తర్వాత పాతికేళ్లకు కానీ ఆయన వేరొక తెలుగు స్ట్రెయిట్ సినిమాకి సంతకం చేయలేదు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత `యాత్ర` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ``కథలో తన పాత్ర ప్రాధాన్యత బావుండాలి. పాజిటివ్ రోల్ అయ్యి ఉండాలి`` అప్పుడే అంగీకరిస్తానని మెగాస్టార్ మమ్ముట్టి కండిషన్ పెడతారట. ఇదేగాక.. దర్శకనిర్మాతలు సినిమాని సజావుగా పూర్తి చేస్తారన్న నమ్మకం ఇంపార్టెంట్. ఆయన కండిషన్ కి కుదిరాడు కాబట్టే మహి.వి.రాఘవ్ కి ఓకే చెప్పాడు. శ్యాందత్తా ద్వారా మమ్ముట్టిని సంప్రదించామని ప్రీరిలీజ్ వేడుకలో మహి.వి.రాఘవ్ టీమ్ తెలిపింది.
నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో మమ్ముట్టి మాట్లాడుతూ .. నాతో స్నేహితుడు శ్యామ్ దత్ ఈ సినిమా కథ గురించి చెప్పారు. సరేనని కథ విన్నాను. 21 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా చేయడానికి చాలా ఎగ్జయిట్ అయ్యాను. రాజశేఖర్ రెడ్డిగారి జీవితంలో చేసిన పాదయాత్ర అనే ఘటనకు సంబంధించిన కథ ఇది. స్క్రిప్టుతోనే ఓకే అనుకున్నా. సినిమా ప్రారంభానికి ముందుగానే డైలాగ్స్ నేర్చుకున్నాను. తప్పులున్నా కరెక్ట్ చేసుకుని నటించాను. తెలుగులో నేను నటించిన మూడో స్ట్రెయిట్ చిత్రమిది. ఎంతో మంది వై.ఎస్.ఆర్‌ని గుండెల్లోపెట్టుకున్నారు. అలాంటి వారంతా నన్ను కూడా గుండెల్లో పెట్టుకుంటారని భావిస్తున్నాను. ఆయన్ను ప్రేమించిన దానిలో నాపై ఒక శాతం ప్రేమ కనిపిస్తే చాలు`` అని అన్నారు.