ఏదైనా పెద్ద సినిమాకు సంబంధించి విడుదలకు ముందే వీడియో ఫుటేజ్ బయటికి వస్తే ఇదేమైనా పబ్లిసిటీ స్టంటేమో అని సందేహించే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. ఐతే ‘బాహుబలి’ టీంకు మాత్రం అలాంటి అవసరమేమీ లేదు. ఈ సినిమాకు ఇలా స్టంట్లు చేయాల్సిన అవసరమేమీ లేదు. ఇప్పటికే ఈ సినిమాపై బోలెడంత హైప్ ఉంది. ఇలాంటి తరుణంలో ‘బాహుబలిః ది బిగినింగ్’ విషయంలో జరిగినట్లే.. ‘ది కంక్లూజన్’ విషయంలోనూ వార్ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్ లీక్ కావడం చిత్ర బృందాన్ని బాగా కలవర పెట్టింది. ఐతే చిత్ర బృందం.. పోలీసులు సమయోచితంగా స్పందించడంతో భారీ నష్టమేమీ వాటిల్లకుండా సమస్య పరిష్కారమైంది.
‘బాహుబలి-2’ వార్ సీక్వెన్స్ లీక్ చేసిన గ్రాఫిక్ డిజైనర్ కృష్ణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసకున్నారు. కేసు పెట్టి అతణ్ని జైలుకు పంపించారు. అతడి దగ్గర 9 నిమిషాల రా వీడియో ఫుటేజ్ ఉన్నట్లు తేలింది. దాదాపు 20 మంది మిత్రులకు దాన్ని షేర్ చేశాడట. అందరినీ విచారించి.. ఆ వీడియో బయటకు పొక్కకుండా సాధ్యమైనంత వేగంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి నెట్లో ఎక్కడా వీడియో ఫుటేజ్ కనిపించట్లేదు. దీన్ని షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ప్రకటించడంతో ప్రస్తుతానికి ఆ వీడియో ఎక్కడా కనిపించట్లేదు. మున్ముందు వాట్సాప్ గ్రూపుల్లోకి వస్తే రావచ్చేమో. ప్రస్తుతానికైతే పోలీసులు పకడ్బందీగా వ్యవహరించడంతో డ్యామేజ్ పెద్దగా జరిగినట్లు లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/