ఏఎన్నార్ నటించిన చిట్టచివరి సినిమా 'మనం'కి అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాకి ఏకంగా ఎనిమిది అవార్డులిచ్చి 'మా' టీవీ గౌరవించింది. ఇటీవలే హైదరాబాద్ నోవాటెల్ లో మాటీవీ అవార్డుల కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మాటీవీ లో ప్రసారం చేయనున్నారు. ఈ వేడుకల్లో 'మనం' చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ నటి, ఉత్తమ కథ సహా మరిన్ని విభాగాల్లో అవార్డులు దక్కాయి.
ఇదే వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందుకున్నారు. 1నేనొక్కడినేలో పెర్ఫామెన్స్ కి ఉత్తమ నటుడిగా జూరీ అవార్డ్ అందుకున్నాడు మహేష్. ఉత్తమ డెబ్యూ నటుడిగా మహేష్ తనయుడు గౌతమ్ కి అవార్డు దక్కింది. కార్యక్రమంలో నాగార్జున, కె.రాఘవేంద్రరావు, వెంకటేష్ వంటి ప్రముఖులు మాట్లాడుతూ ..''సూపర్ స్టార్ కృష్ణ సినిమా కోసం ఎంతో చేశారు. ఏఎన్నార్, కృష్ణ కృషి వల్లే పరిశ్రమ ఇంత పెద్ద స్థాయికి ఎదిగింద''ని ప్రశంసించారు.
ఈసారి మా అవార్డులు చాలా పారదర్శకంగా జరిగాయని ఈ రెండు ఎంపికల్ని బట్టి అర్థమవుతోంది. వాస్తవంగానే 'మనం' అన్ని అవార్డులు అందుకునే అర్హత ఉన్న సినిమా. అలాగే 1నేనొక్కడినే చిత్రంలో మహేష్ అసమాన ప్రదర్శన, గౌతమ్ క్యూట్ అప్పియరెన్స్‌కి పురస్కారాలివ్వడం సముచితం. సూపర్ స్టార్ కృష్ణకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ ఇచ్చి గౌరవించడం తెలుగువాడికి ఇచ్చిన గౌరవం కిందే లెక్క.