కాటమరాయుడు కోసం పాప పొయెట్రి

Update: 2017-03-04 05:29 GMT
మూడున్నరేళ్ల క్రితం వచ్చిన రొమాన్స్ మూవీతో సినీ అరంగేట్రం చేసిన మానసకు కాలం కలిసి రాలేదు. ఆ తర్వాత కన్నడలో చేసిన ప్రయత్నం కూడా అచ్చి రాలేదు. కానీ సడెన్ గా ఈ భామకు క్రేజ్ వచ్చేసింది. పవర్ స్టార్ మూవీలో ఛాన్స్ రాగానే.. అందరూ ఈమెను కాటమరాయుడు గాళ్ అనే సరికి విపరీతమైన హంగామా ఈమె చుట్టూ నెలకొంది.

తన కెరీర్ లో ఇప్పటివరకూ ఇలాంటి రియాక్షన్ తెలియని మానస.. ఒక్కసారిగా వచ్చిన ఈ క్రేజ్ కి ఉబ్బితబ్బిబ్బయిపోతోంది. ఇదంతా తన గొప్పదనం కాదని.. పవన్ సినిమాలో అవకాశం దక్కడంతోనే అనే విషయం ఈ చిన్నదానికి బాగానే తెలుసు. ఈ ఆనందంలో పొయెట్రీకి ప్రోజ్ ను కూడా మిక్స్ చేసి కబుర్లు చెప్పేస్తోంది మానస. పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసిన ఈ భామ 'ఈ వ్యక్తితో నేను ప్రేమలో పడిపోయాను. నిజానికి ఈ ఫోటో పోస్ట్ చేసే ముందు ప్రోజ్ పొయెట్రీ రాద్దామనుకున్నా. కానీ అతని మాయ కారణంగానో ఎందుచేతో కానీ పదాలు రావడం లేదు. పెన్ను కదలడం లేదు. అక్కడ సంతోషంగా కనిపిస్తున్న నేను ఎన్నో మాటలు చెబుతున్నట్లు లేదూ' అని చెప్పింది మానస.

పవన్ మాయ రొమాన్స్ మానసపై బాగానే పని చేసినట్లుంది కదూ. మాటలు రావడం లేదని అంటోంది కానీ.. చాలానే కబుర్లు చెప్పేసింది మానస.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News