చాలామంది సెలబ్రిటీలు ఎప్పటినుండో అనాదిగా ఫాలో అవుతున్న ఒక ఆచారం ఏంటంటే.. మాంచి ఇన్వెస్టుమెంటును చూసుకొని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం. సచిన్ 'సచిన్స్' అంటూ.. గంగూలి 'సౌరవ్స్' అంటూ ఎప్పుడో హోటళ్ళు పెట్టారు. ఇక నాగార్జున కూడా 'ఎన్-గ్రిల్' అంటూ హైదరాబాద్ లో రెస్టారెంట్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు వారి అల్లుడు యాండి శ్రీనివాసన్ కూడా ఇదే రూటులోకి వచ్చేశాడు.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ''జూనియర్ కుప్పన్'' అంటూ ఇప్పుడు ఒక కొత్త థీమ్ రెస్టారెంట్ పెట్టాడు మంచు లక్ష్మి భర్త ఆండీ శ్రీనివాసన్. గతంలో అమెరికాలో సాఫ్టువేర్ రంగంలో సెటిల్ అయిన ఆండీ.. ఎప్పుడైతే లక్ష్మీ ఇక్కడ టాలీవుడ్ లో నటిగా నిర్మాతగా బిజీ అయ్యిందో.. వెంటనే హైదరాబాద్ కు తన మకాం మార్చేశాడు. ఇప్పుడు మోహన్ బాబు సపోర్టుతో పర్మినెంటుగా ఇక్కడ కొన్ని బిజినెస్ లు నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో.. ఇక్కడే ఒక రెస్టారెంట్ తెరిచాడు. ఈరోజు ఉదయమే ఓపెనింగ్ అయ్యింది.
అయితే ఈ ''జూనియర్ కుప్పన్న'' అనేది చెన్నయ్ కు చెందిన ఒక రెస్టారెంట్ చైన్. హైదరాబాద్ లో ఓపెన్ చేసిన ఈ బ్రాంచ్ తమ 33వ ఔట్లెట్ అట. దీనిని మంచు వారి అల్లుడు ఫ్రాంచైజ్ గా తీసుకున్నాడులే.