వీళ్లిద్దరూ కొత్త ఫ్రెండ్సా??

Update: 2016-03-18 16:18 GMT
మొన్నటివరకు తెలుగు సినిమా ఇండస్ర్టీలో కొత్త స్నేహితులు ఎవరూ అంటూ.. అదిగో మన రకుల్‌ ప్రీత్‌ - రెజీనా అండ్‌ రాశి ఖన్నా అన్నారు. వీరందరినీ ఇలా ఒకే తాటిపైకి తీసుకొచ్చి కలిపింది మాత్రం మన హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. కాని ఇప్పుడు ఈక్వేషన్లు మారినట్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే సడన్‌ గా రానా దగ్గుబాటి మాంచి స్నేహితుడు అయిపోయాడో.. అప్పటినుండో హీరోయిన్‌ రకుల్‌ క్యాంపు మార్చేసిందట.

ఈ మధ్యన రకుల్‌ ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా మంచు లక్ష్మితో కలసి తిరుగుతోందట. అంతెందుకు.. శుక్రవారం మార్నింగ్‌ అమ్మడు ఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌ ధియేటర్లో.. లక్ష్మీతో కలసి ''కళ్యాణ్‌ వైభోగమే'' సినిమా చూసింది. ఇద్దరూ కలసి సినిమాను బాగా ఎంజాయ్‌ చేశారట. ఇద్దరూ ఎంజాయ్‌ చేయడం.. అదంతా ఒకె కాని.. వీరిద్దరి కొత్త ఫ్రెండ్‌ షిప్‌ మాత్రం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయిపోయింది. గతంలో ఎక్కువగా తాప్సీతో కలసి ఇలాగే తిరిగేది లక్ష్మి మంచు. ఆ తరువాత మన ఢిల్లీ బెల్లి ముంబయ్‌ కు మకాం మార్చేయడంతో ఇప్పుడు మరో ఢిల్లీ బెల్లి రకుల్‌ ప్రీత్ తో స్నేహం చేస్తోందనమాట. మరి రకుల్‌ కూడా రెజీనాను పక్కనెట్టేసి.. ఇలా మంచుతోనే తిరుగుతోందట.

సర్లేండి.. ఎప్పుడూ స్నేహితులందరూ కలసి తిరగడం కుదరదు కదా.. సో.. అప్పుడప్పుడూ ఇలా ఈ ఇద్దరూ తిరుగుతున్నారంతే.
Tags:    

Similar News