అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన ‘ఆర్ఎక్స్ 100’ సంచలన వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బయ్యర్ల పెట్టుబడి మీద నాలుగు రెట్ల షేర్ వసూలు చేయడం అనూహ్యమే. గత వారాంతంలో విడుదలైన కొత్త సినిమాల్ని కూడా వెనక్కి నెట్టి ఈ చిత్రమే బాక్సాఫీస్ దగ్గర హవా సాగిస్తోంది. దీని జోరు ముందు నిలవలేకపోయిన కొత్త సినిమాల్లో ‘వైఫ్ ఆఫ్ రామ్’ కూడా ఒకటి. ఐతే ఆ చిత్ర కథానాయిక.. నిర్మాత అయిన మంచు లక్ష్మి ‘ఆర్ ఎక్స్ 100’ విషయంలో నెగెటివ్ రిమార్క్స్ చేసింది. ఆ సినిమా పేరెత్తకుండానే దానిపై విమర్శలు గుప్పించింది. బోల్డ్ సినిమాలకు.. వల్గర్ సినిమాలకు తేడా ఉందని.. మహిళల్ని తక్కువగా చూపించడాన్ని తాను ఖండిస్తానని మంచు లక్ష్మి చెప్పింది. ‘ఆర్ ఎక్స్ 100’లో హీరోయిన్ని మోసకారిగా చూపించిన సంగతి తెలిసిందే. పరోక్షంగా దీన్ని మంచు లక్ష్మి ఖండించింది.
వల్గారిటీని హైలైట్ చేసే సినిమాల కంటే ‘మహానటి’.. ‘పెళ్ళిచూపులు’.. ‘క్షణం’ లాంటి సినిమాల్ని తాను ఎక్కువ ఇష్టపడతానని మంచు లక్ష్మి చెప్పింది. మరి బోల్డ్ మూవీగా పేరొందిన ‘అర్జున్ రెడ్డి’ సంగతేంటి అని అడిగితే.. ఆ సినిమా తనకెంతో నచ్చిందని చెప్పింది. అది వల్గర్ మూవీ కాదని అంది. ‘అర్జున్ రెడ్డి’ రియల్ కల్ట్ మూవీ అని.. అందులో ఒక వ్యక్తి నిజమైన ఎమోషన్లను చక్కగా చూపించారని ఆమె చెప్పింది. కానీ ఇప్పుడు రిలీజైన కొత్త సినిమాలో (ఆర్ ఎక్స్ 100ను ఉద్దేశించి) మహిళను తప్పుగా చూపించారని ఆమె అంది. ఐతే మంచు లక్ష్మి అభిప్రాయంతో ఏకీభవించేవాళ్లూ ఉన్నారు. విభేదించే వాళ్లూ ఉన్నారు. సమాజంలో అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నపుడు.. అలాంటి పాత్రల్ని తెరమీద చూపిస్తే తప్పేంటన్నది రెండో వర్గం వాదన. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి చిన్న సినిమా సాధించిన విజయం మాత్రం అనూహ్యం.