మంచు హీరోయిన్.. ఇలా కూడా కనిపిస్తుందా

Update: 2016-05-07 07:56 GMT
మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మి.. కేరక్టర్లు, గెటప్స్ విషయంలో డిఫరెంట్ గా కనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ కూడా చాలా స్టైలిష్ వేర్ ధరించడం ఈమెకు హాబీ. అటు ట్రెడిషనల్. ఇటు మోడర్న్.. రెండింటినీ మిక్స్ చేసి మరీ మెరిసిపోవడం లక్ష్మి మంచు స్పెషాలిటీ. తన డ్రెసింగ్ తో ఆకట్టుకోవడం మంచు వారమ్మాయికి కామనే కానీ.. స్కిన్ షో లాంటి వాటికి ఇన్నాళ్లూ ఈమె చాలా దూరంగానే ఉంది.

కానీ ఇప్పుడు ఈ విషయంలో కూడా కొంచెం బెట్టు సడలించిందని అర్ధమవుతోంది. ప్రస్తుతం లక్ష్మి మంచు ఓ హాలీవుడ్ సినిమాలో కనిపిస్తోంది. బాస్మతీ బ్లూస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ పిక్చరైజేషన్ కొంచెం ఆలస్యమైనా.. మొత్తానికి ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చింది. ఈ మూవీలో సీత అనే రోల్ చేస్తున్న లక్ష్మి.. తన స్కిన్ షోతో కూడా ఆకట్టుకుంటోంది. గతంలో కూడా ఓ హాలీవుడ్ మూవీ చేసిన అనుభవం ఉన్న లక్ష్మి మంచు.. అప్పుడు గ్లామర్ కనిపించగా.. ఇప్పుడు క్లీవేజ్ షో కూడా చేసేస్తోంది.

అఫ్ కోర్స్.. ఇది హాలీవుడ్ మూవీ కాబట్టి.. కేవలం స్కిన్ షో అనే కాన్సెప్ట్ లో ఉండకపోవచ్చు. కేరక్టర్ ప్రకారమే ఇలాంటి డ్రెసింగ్ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు కానీ.. మంచు లక్ష్మి దీనికి సై అనడమే అసలు టాపిక్. ఇప్పటివరకూ ఇలాంటి డిఫరెంట్ లుక్ లో కనిపించని లక్ష్మి మంచును.. ఇంత గ్లామర్ గా చూసిన అభిమానులు తెగ థ్రిల్ అయిపోతున్నారు.
Tags:    

Similar News