మంచు వారి కొత్త ‘వేట’

Update: 2018-01-07 07:02 GMT
అదేమో కాని స్టార్ హీరో ఫ్యామిలీస్ లో కొంచెం టైం అటుఇటుగా ఉన్నది మంచు వారికే. మంచు విష్ణు, మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి దశాబ్దం దాటినప్పటికీ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు.,మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మి పరిస్థితి బుల్లితెర వరకు కొంత నయం. నేను సైతం  టాక్ షో విత్ లక్ష్మి లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా కూడా అవి ఏ మాత్రం వర్క్ అవుట్ కాకపోవడంతో కొంచెం గ్యాప్ తీసుకుని మరో సినిమా చేస్తోంది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టే. విజయ్ ఎలకంటి అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. దీనికి టైటిల్ గా ‘వేట’ అని ఫిక్స్ అయినట్టు తాజా సమాచారం.

ఇదే టైటిల్ తో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. హాలీవుడ్ రీమేక్ గా వచ్చిన ఈ మూవీ అప్పట్లో జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. తర్వాత బాలాదిత్య హీరోగా ఒక వేట వచ్చింది. అది డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు ఈ వేట మూడోది అవుతుంది. తనకు జరిగిన అన్యాయానికి బాధ్యులైన వాళ్ళను వేటాడే పాత్రలో మంచు లక్ష్మి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. దర్శకుడు విజయ్ గతంలో బాహుబలి కోసం రాజమౌళి దగ్గర శిష్యరికం చేసినవాడే. లక్ష్మి బాంబు పేలిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని వస్తున్న లక్ష్మి వేట రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు.
Tags:    

Similar News