ఓవైపు తొలకరి పలకరించే వేళ. వాతావరణం చల్లబడి దేహం వేడిని కోరుకునే వేళ... సరిగ్గా ఇలాంటి టైమ్‌లో హలీమ్, ధమ్ బిర్యానీ వేడి వేడిగా నాలుకను టచ్ చేస్తే? ఆ ఫీలింగే వేరు. చికెన్, మటన్ హలీమ్‌ని, చికెన్ జాయింట్లను నోట్లో వేసి గుటకాయ స్వాహా అనిపించేస్తే.. ఆ ఖుషీయే వేరు. అసలే ముస్లిమ్ సోదరులు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్ర మాసంగా భావించి హలీమ్, బిర్యానీ సేవనంలో ముగినిపోయి ఉన్నారు. వారితో పాటు కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా హైదరాబాదీలంతా హలీమ్‌ని జుర్రేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
మరోవైపు సిటీలో ఉన్న టాప్ సెలబ్రిటీలంతా హలీమ్ సేవనంలో మునిగి ఉన్నారు. హీరోలు, హీరోయిన్‌లు, నటీనటులు అంతా వీలున్న ప్రతిసారీ హలీమ్ గురించిన ప్రత్యేకించి ప్రస్థావిస్తున్నారు. ఇటీవలే కొత్త పెళ్లికొడుకు హీరో ఆది తన భార్య అరుణతో కలిసి చికెన్ ధమ్ బిర్యానీ లాగించేస్తూ మీడియా కంటికి చిక్కాడు. త్వరలోనే హలీమ్ తినడానికి రెడీ అవుతున్నానని చెప్పాడు. ఈలోగానే లక్ష్మీ ప్రసన్న కూడా లైన్‌లోకొచ్చింది. చికెన్ ధమ్ బిర్యానీ అంటే లొట్టలు వేసుకుని తినడానికి రెడీ.
పాత బస్తీలో వేకువఝాము 2 గంటలకు వేడి వేడి బిర్యానీ తినడం నాకు అలవాటు.. అని కొత్త సంగతి చెప్పింది. అంతేనా ఖుర్బానీకా మీటా ఆఫ్టర్ బిర్యానీ తప్పనిసరి అని చెప్పింది. ఇంట్లో మమ్మీ వండే బిర్యానీ అయితే ఏకంగా ఎంటాసిడ్లు జేబులో పెట్టుకుని వెళ్లాల్సిందేనని కిసుక్కున నవ్వేసింది లక్ష్మీ మంచు. ఈ సీజన్‌లో ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్‌తో కలిసి బిర్యానీ, హలీమ్ కాంటెస్టుకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా చిట్‌చాట్‌లో చెప్పిన సంగతులివి.