సినిమాల్లో అనుకున్నంతగా విజయవంతం కాలేకపోయింది మంచు లక్ష్మి. నిర్మాతగా.. నటిగా ఆమె చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఇప్పుడు ఆమె రాజకీయాల వైపు చూస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మంచు లక్ష్మికి టికెట్ కూడా కన్ఫమ్ చేసిందట. సరైన నియోజకవర్గం ఎంచుకునే అవకాశం కూడా ఆమెకే ఇచ్చిందట. ప్రస్తుతం ఆ దిశగా కసరత్తులు చేస్తోందట మంచు లక్ష్మి.
బహుశా ఆమె తన తమ చిత్తూరు జిల్లాలోనే ఓ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశముంది. విద్యా నికేతన్ తరఫున తిరుపతి.. చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాల్లో మంచు ఫ్యామిలీ చాన్నాళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఆ పరిధిలోనే ఏదో ఒక నియోజకవర్గం నుంచి మంచు లక్ష్మి పోటీ చేసే అవకాశముంది. ఐతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం-భాజపా కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది కీలకం. దాన్ని బట్టి కూడా మంచు లక్ష్మి నియోజకవర్గం ఏదన్నది తేలొచ్చు.
మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు ఎంపీగా పనిచేశారు. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలతోనూ మంచి సంబంధాలున్నాయి. మరోవైపు మంచు లక్ష్మి ఆడబిడ్డ వెరోనికా జగన్ కుటుంబానికి దగ్గరి బంధువు. మంచు లక్ష్మి కోరుకుంటే తెలుగుదేశం పార్టీలో కూడా టికెట్ సంపాదించవచ్చేమో. ఐతే ఆమె భాజపాను ఎంచుకుంది. గతంలో ఆమె.. మోహన్ బాబు నరేంద్ర మోడీ మీద ప్రశంసలు కురిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లక్ష్మి భాజపా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/