రోజా ప్లేస్ లో మంచు లక్ష్మి వచ్చేసింది

Update: 2015-12-27 05:56 GMT
అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ కావడంతో రోజా ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్నారు. తానేం తప్పు చేయలేదని రోజా చెబుతున్నా.. ఆమె మాటలు ఆన్ లైన్ లో లీక్ అయ్యి, పెద్ద వివాదాన్నే సృష్టించాయి. ఇదే టైంలో ఆమెకు జబర్దస్త్ నిర్వాహకులు కూడా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు - రోజా జడ్జ్ గా ఉన్నారు. కానీ రీసెంట్ ఎపిసోడ్ లో రోజా స్థానంలో మంచు లక్ష్మి కనిపించడం హాట్ టాపిక్ అయింది. రోజాను ఎందుకు రీప్లేస్ చేశారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. రోజాకు నెగిటివ్ గా ఉండడం, తోటి మహిళను ఉద్దేశించి రోజా చేసిన కామెంట్స్ మరీ వల్గర్ గా ఉండడం.. తమ షో రెప్యుటేషన్ పై పడుతుందనే ఉద్దేశ్యంతోనే.. రోజాను తప్పించారని చెప్పుకుంటున్నారు.

అయితే.. ఇది నిజం కాకపోవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. రోజా సస్పెన్షన్ కు, ఈ ప్రోగ్రాం టెలికాస్టింగ్ కు మధ్య వారం వ్యవధి కూడా లేదు. ఇంత షార్ట్ పీరియడ్ లో జడ్జ్ ను తప్పించేసి, కొత్త జడ్జ్ ను తీసుకుని, ప్రోగ్రాం షూట్ చేసేసి టెలికాస్ట్ చేయడం కష్టం. అంటే.. ఇది అంతకుముందే పిక్చరైజ్ చేసి ఉండొచ్చు. తాను బిజీగా ఉండడంతో కొన్ని ఎపిసోడ్స్ కు అందుబాటులో ఉండడని రోజా చెప్పడంతో.. ఆమె స్థానంలో మంచు లక్ష్మిని తీసుకుని కొన్ని ఎపిసోడ్స్ చేసి ఉండొచ్చంటున్నారు. మరి ఈ రెండింటిలో ఏది వాస్తవం అని తెలియాలంటే.. మరి కొన్ని ఎపిసోడ్స్ చూడాల్సిందే.

Tags:    

Similar News