మంచు మనోజ్ ఇప్పుడు గుంటూరోడుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీజర్ నుంచే పక్కా కమర్షియల్ మూవీ అనే విషయాన్ని చెప్పేసింది గుంటూరోడు యూనిట్. మంచు మనోజ్ సినిమాల్లో కమర్షియల్ యాంగిల్ ఉంటుంది కానీ.. ఇంత పక్కాగా ఓన్లీ కమర్షియల్ మూవీలో కనిపించడం మాత్రం అరుదుగానే జరుగుతుంది. ఇందుకు కారణం వివరించాడు ఈ మంచు కుర్రాడు.
'నేను ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటానని అంటూ నా ఫ్యాన్స్ తో వెల్ విషర్స్ అంటూ ఉంటారు. కమర్షియల్ సినిమాలు చేస్తే చూడాలని ఉందని చాలా కాలంగా చెబుతూ ఉంటారు. 11 నెలలకే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నేను.. 2014 నుంచి హీరోగా చేస్తున్నాను. ఈ సమయంలో 18 సినిమాలు చేసినా.. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించాను. వేదం లాంటి కేరక్టర్స్ తో మీ ముందుకు వచ్చాను. కమర్షియల్ రేంజ్ పక్కన పెడితే.. నేను మీకు తెలుసా?.. వేదం.. ఎటాక్.. శౌర్య.. ఇలా అన్నీ విభిన్నమైన సినిమాలే. నా మనస్సుకు నచ్చిన సినిమాలు' అన్నాడు మంచు మనోజ్.
'ఎప్పుడు అవే నాలుగు ఫైట్లు.. నాలుగు డ్యాన్సులు కాకుండా ఆర్టిస్టుగా ఏదైనా కొత్తగా చూపిద్దామనే ప్రయత్నించాను. కానీ మీ కోసం గుంటూరోడు అంటూ పక్కా కమర్షియల్ మూవీ చేశాను. ఇకనుంచి అటు విభిన్నమైన పాత్రలతో పాటు ఇటు పక్కా కమర్షియల్ మూవీస్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను' అంటూ అభిమానులకు హుషారు కలిగించే మాట చెప్పాడు మంచు మనోజ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/