మోహన్ బాబుది ఏ కులం??

Update: 2017-09-11 04:17 GMT
విమర్శకులకు ఛాన్స్ ఇవ్వకుండా ఏం మాట్లాడినా ధైర్యంగా మాట్లాడుతారు మంచు వారి కుటుంబ సభ్యులు. ఇతరులు ఎన్ని విమర్శలు చేసిన వాటికి దీటుగా సమాధానం చెప్పడం మోహన్ బాబు గారికి  బాగా అలవాటైన విషయమే. ఆయన కులానికి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అయితే అదే తరహాలో మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్  ట్విట్టర్ వేదికగా ఇచ్చిన ఓ సమాధానం అందరిని వావ్ అనిపించింది.

వివరాల్లోకి వెళితే.. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు 1990 లో వచ్చిన మోహన్ బాబు-అల్లుడు గారు సినిమా షూటింగ్ లోని ఓ ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అయితే ఓ నేటిజెన్ మోహన్ బాబు గారు చౌదిరా లేదా నాయుడా అని క్యాస్ట్ గురించి అడిగాడు. దీంతో వెంటనే మనోజ్ ఆ నేటిజెన్ కి ''మనం దేశం ప్రేమికులం.  "ముస్లిం" అని రిప్లై ఇచ్చాడు.  ఇక ఇంతలో మరొక నెటిజన్ భయ్యా కులం అడిగితే మతం గురించి చెప్పారేంటి? అని కామెంట్ చేయగా. దీనికి మనోజ్ ..'' వాటి రెండింటికి పెద్ద తేడా లేదు బ్రదరూ.. మనం ఇండియన్స్. అంతకు మించి మనుషులం. మన కులం ప్రేమికులం'' అని తన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు మంచి మనసున్న మనోజ్.

అయినా పిచ్చి కాకపోతే.. అసలు ఇలా పెద్ద పెద్ద లెజండరీలను పట్టుకుని మీదే కులం? అని అడగొచ్చా? అలా ఒక కులానికే వారిని పరిమితం చేస్తారా? ఎన్టీఆర్.. చిరంజీవి.. మోహన్ బాబు.. వీరందరూ యావత్ తెలుగు జాతిని రిప్రజెంట్ చేస్తున్న ఎంటర్టయినర్లు. వారికి కులం అంటగట్టడం మనం చేతకానితనం!!
Tags:    

Similar News