తెలుగు యువ హీరోల్లో మంచు మనోజ్ - తారక్ ల ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఒక్క ట్వీట్ తో తారక్ అభిమానులందరికీ అభిమాని అయిపోయాడు మంచు మనోజ్. ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉండే హీరోల్లో మనోజ్ ఒకడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అలానే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తారక్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
‘అన్నా... నీకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం’- అని ఒక అభిమాని మనోజ్ ను అడిగాడు. దానికి వెంటనే స్పందించిన మనోజ్... ‘నా ప్రాణం లెక్క చేయనంత’ అని జవాబు ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని ఖుష్ అయ్యాడు. ఇక, వరుసగా మనోజ్ కి రకరకాల సలహాలు ఇచ్చేశారు. మనోజ్ - తారక్ ల కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తే చూడాలని మరో అభిమాని అభిలషించాడు. మంచు వారిది మంచి ఫ్రెండ్ షిప్ అంటూ మరో అభిమాని కామెంట్ పెట్టాడు.
ఇంకోపక్క, తారక్ అభిమానులు కూడా చాలా ఖుషీగా ఉన్నారు. మనోజ్ ఇచ్చిన సమాధానంతో తారక్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ అంటే మనోజ్ కు ఎంత అభిమానమో అంటూ మెచ్చుకుంటున్నారు. ఆ ఇద్దరి ఫ్రెండ్ షిప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. స్నేహం ఉన్నా సరే ఇలా బాహాటంగా ఎలాంటి భేషజాలు లేకుండా వ్యక్తీకరించే గుణం ఎంతమందికి ఉంటుందని అంటున్నారు. ఒక్క ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు మనోజ్.