పెళ్లి కార్డ్ చూడగానే పెళ్లి ఎంత ఘనంగా జరుగబోతోందో చెప్పేయొచ్చు. అందుకే పెళ్లి కార్డ్ డిజైన్ విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. అంతేకాదు టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక అడుగు ముందుకు వేసి ఈ కార్డ్ డిజైన్ కోసం ఏకంగా ఆర్టిస్టులను రంగంలోకి దించుతున్నారు. దేవతల ముఖాలతో పురాణాల నాటి సందడిని తలపించేలా డిజైన్లను ఈ ఆర్టిస్టులు తయారు చేస్తున్నారు
దీనికోసం హైదరాబాద్, ముంబై, కోల్‌కత నుంచి ప్రఖ్యాత ఆర్టిస్టులను సైతం రంగంలోకి దించుతున్నారు. హైదరాబాద్‌లో రమేష్ గోర్జల ఇలాంటి డిజైన్‌లకు పెట్టింది పేరు. ఇటీవలే మంచు మనోజ్ పెళ్లి కార్డ్ డిజైన్ చేసింది ఇతగాడే. మంచు విష్ణు సెలక్షన్‌లో ఈ డిజైన్‌ని రూపొందించారాయన. అంతేకాదు అంతకంటే ముందే నిర్మాత సురేష్‌బాబు తనయ మాళవిక వెడ్డింగ్ కార్డ్ డిజైన్ కూడా ఈయనే రూపొందించారు.
టాలీవుడ్ సెలబ్రిటీలకు కొందరు ఆర్టిస్టులు కోల్‌కత నుంచి కూడా వచ్చి డిజైన్ చేసిన సందర్భాలున్నాయి. ఇలా వెడ్డింగ కార్డ్‌ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముద్రిస్తున్నారు కాబట్టి అది ఆర్టిస్టులకు సైతం ఉపాధిని కల్పిస్తోంది. ఇది శుభపరిణామమే.