ప్రమాణ స్వీకారంలో హీరో దంపతుల అలజడి

Update: 2019-05-30 15:13 GMT
అశేషాంధ్రులు ఎదురుచూసిన మధురక్షణం... జగన్ ప్రమాణ స్వీకారం. ఇది ఎన్నో వార్తలకు వేదికైంది. మరెన్నో గొప్ప నిర్ణయాలకు నెలవైంది. దేశంలోని పలువురి ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వేడుకలో మంచు విష్ణు - విరోనికాలు ఇద్దరూ హాజరై ఆకర్షణగా నిలిచారు.

విరోనికా తల్లిదండ్రుల వైపు జగన్ కి బంధుత్వం ఉంది. పైగా మంచు ఫ్యామిలీ ఎన్నికల పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వారికి కూడా జగన్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఫోన్లోనూ ఆహ్వానించారు. దీంతో కుటుంబ సమేతంగా విష్ణు హాజరయ్యారు. ఇందిరాగాంధీ స్టేడియానికి త్వరగా చేరుకున్న విష్ణు అక్కడ యాక్టివ్ గా అభిమానులతో ముచ్చటించారు. పలువురు పార్టీ ప్రముఖులను పలకరించారు. ప్రమాణ స్వీకారం మొత్తం ముగిసే వారు దంపతులు అక్కడే ఉండి మీడియాలో హల్ చల్ చేశారు.

విరోనికా వారిద్దరి సెల్ఫీని వైఎస్ జగన్ అనే నేను హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దానికి భారీ స్పందన వచ్చింది.
Tags:    

Similar News