'డైనమైట్' సినిమాతో ఓ రేంజు హడావుడి చేశాడు మంచు విష్ణు. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఏకంగా 'బాహుబలి'తో పోటీ పెట్టేస్తాడేమో అన్నంత బీభత్సమైన టాక్ వచ్చేసింది. కట్‌చేస్తే విష్ణు పోటీ నుండి తప్పేసుకున్నాడు. కాని శ్రీమంతుడు రిలీజ్ అయ్యాకైనా వస్తాడా అనుకుంటే, అబ్బే ముహూర్తం ఇంకా సెట్ కాలేదట. దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ రీమేక్ సినిమా ఆడియో ఆల్రెడీ రిలీజ్ అయ్యిందిలే.
నిజానికి ఎప్పుడో జూన్ లో రావల్సిన 'డైనమైట్' సినిమా, జూలై 10న బాహుబలి ఆగస్టు 7న శ్రీమంతుడు సినిమాలకు మధ్యలో వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే విష్ణు మాత్రం రిస్కు తీసుకోలేదు. ఇక శ్రీమంతుడు వచ్చేశాకైన వస్తుందా అనుకుంటే.. ఏదో ఆగస్టు 14 తప్పించి.. తక్కిన డేట్లన్నీ బిజీయే. 21న కిక్ 2, సెప్టెంబర్ 4న రుద్రమదేవి సినిమాలు తిష్ట వేసేశాయి. అందుకే విష్ణు అసలు ఈ దరిదాపుల్లో కనిపించకుండా ఏకంగా అక్టోబర్ 1 నాటికి పోస్ట్ పోన్ అయిపోయాడు.
ఎలాగో దసరా సీజన్ కోసం చిన్న సినిమాలేవీ లైన్ లో లేవు. అక్టోబర్ 12న రామ్ చరణ్ వస్తాడనే న్యూస్ ఉండటంతో అందరూ ఆ నెల మీద ఆశలు వదిలేసుకున్నారు. అందుకే 1న వచ్చేస్తే, తెల్లారి ఎలాగో గాంధీ జయంతి కలిసొస్తుంది కాబట్టి, హ్యాపీగా ఓ రెండు వారాలు దున్నేసుకోవచ్చు అనేది మనోడి ప్లాన్. కాని అప్పటి వరకు సినిమాను ప్రజల్లో యాక్టివ్ గా ఉంచేదెలా? మరీ అంత వెనక్కెళ్ళిపోతే ఆడియన్సు సినిమాను గుర్తించుకుంటారేటి...